Sai Dharam Tej: గొప్ప మనసు చాటుకున్న మెగా హీరో.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు.. ఏం చేశాడంటే?

by Mallepaka Hamsa |

మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌(Sai Dharam Tej)కు గతంలో యాక్సిడెంట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో కొద్ది రోజులు సినిమాలకు దూరం అయి పూర్తి రెస్ట్ తీసుకున్నారు.

Sai Dharam Tej: గొప్ప మనసు చాటుకున్న మెగా హీరో.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు.. ఏం చేశాడంటే?
X

దిశ, సినిమా: మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌(Sai Dharam Tej)కు గతంలో యాక్సిడెంట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో కొద్ది రోజులు సినిమాలకు దూరం అయి పూర్తి రెస్ట్ తీసుకున్నారు. మళ్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో 2023లో ‘బ్రో’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్, సంయుక్తా మీనన్(Samyukta Menon) కలిసి నటించిన మూవీ ‘వీరూపాక్ష’(Virupaksha) బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఏడాది పాటు గ్యాప్ తీసుకున్న ఆయన మళ్లీ ‘సంబరాల ఏటిగట్టు’(Sambarala Yeti Gattu) మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో కోలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి(Aishwarya Lakshmi) హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో.. తాజాగా, సాయి ధరమ్ తేజ్ షూటింగ్ సెట్‌కు అభిమానులు వెళ్లి ఆయనతో మాట్లాడారు.

ఇక తన దగ్గరికి వచ్చిన వారిని అలాగే పంపించకుండా మెగా మేనల్లుడు ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా భోజనాలను ఏర్పాటు చేయించి వారి కడుపునింపారు. అలాగే తనతో సెల్ఫీ దిగి వారి ఆనందానికి కారణం అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు అన్నిటిలోకెల్ల అన్నదానం గొప్పదని సాయి ధరమ్ తేజ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మామకు తగ్గ అల్లుడు అని అంటున్నారు.

Next Story