- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మూవీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. గుండెపోటుతో ‘కాంతార‘ నటుడు కన్నుమూత
by Kema Shiva Kumar |
కన్నడ మూవీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: కన్నడ మూవీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ సునామీ సృష్టించిన కాంతార చిత్రంలో నటించి ప్రముఖ నటుడు టి.ప్రభాకర్ కాసేపటి క్రితం గుండెపోటుతో మృతి చెందారు. కర్ణాకటలోని ఉడిపి జిల్లా పరిధిలోని హిరియాడ్కాలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. అయితే, రిషభ్ షెట్టి ప్రధాన పాత్రలో నటించిన మహాదేవ కాంతార మూవీలో మహాదేవ పాత్ర పోషించాడు. ఐదేళ్ల క్రితం టి.ప్రభాకర్‌కు గుండెకు వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. తాజాగా, అయనకు మళ్లీ గుండెపోటు రావడంతో ప్రాణాలు కోల్పోయారు. ప్రభాకర్‌కు భార్య, కుమారుడు ఉన్నారు. తొలుత నాటకాలు వేసిన ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ సినిమాల్లోకి రంగ ప్రవేశం చేశారు.
Next Story






