భువినుంచి దిగివచ్చిన దేవకన్యనా..? ట్రెడిషనల్ లుక్‌లో మెస్మరైజ్ చేస్తున్న రామ్ హీరోయిన్

by I. Sairam |

‘నన్ను దోచుకుందువటే’(Nannu Dochukundhuvate) మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన నభా నటేష్(Nabha Natesh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

భువినుంచి దిగివచ్చిన దేవకన్యనా..? ట్రెడిషనల్ లుక్‌లో మెస్మరైజ్ చేస్తున్న రామ్ హీరోయిన్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘నన్ను దోచుకుందువటే’(Nannu Dochukundhuvate) మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన నభా నటేష్(Nabha Natesh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత ‘అదుగో’(Adugo) అనే సినిమాలో నటించింది. కానీ ఈ చిత్రం అంతగా విజయం సాధించలేకపోయింది. ఆ తర్వాత ఎనర్జిటిక్ స్టార్ రామ్(Ram Pothineni) నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’(Ismart Shankar) మూవీతో ఫుల్ ఫామ్‌లోకి వచ్చింది. దీంతో ఈ చిన్నదానికి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి.

అలా ‘డిస్కో రాజా’(Disco Raja), ‘సోలో బ్రతుకే సో బెటర్’(Solo Brathuke So Better), డార్లింగ్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం నిఖిల్(Nikhil) సరసన ‘స్వయంభు’(Swayambhu) మూవీలో నటిస్తోంది. అలాగే సోషల్ మీడియా(Social Media)లో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ తన అందచందాలతో కుర్రకారుకు అందాల విందును వడ్డిస్తుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా నభా నటేష్ తన ఇన్‌స్టా(Instagram) వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది.

అందులో మెరూన్ కలర డ్రెస్సులో ట్రెడిషనల్‌గా రెడీ అయింది. పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్, చేతులకు గాజులు, పాపిట బిళ్ళ పెట్టుకొని మంచిగా కనిపించింది. ఇక వీటికి.. ‘నా ఇంటి వెనుక ప్రాంగణం నుండి కొన్ని సౌందర్యాలను మీ ఫీడ్ కు తీసుకువస్తున్నాను’ అని రాసుకొస్తూ హార్ట్ సింబల్ జోడించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్‌గా మారగా.. వీటిని చూసిన నెటిజన్లు భువినుంచి దిగివచ్చిన దేవకన్య నా.. అప్సరస నా అని కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు కూడా ఈ భామ ఫొటోస్‌పై ఓ లుక్ వేసేయండి.

Next Story