పబ్లిక్‌లో నటికి ముద్దు పెట్టబోయిన అభిమాని.. షాక్‌లో ఏం చేసిందో తెలుసా? (వీడియో)

by Gantepaka Srikanth |

బాలీవుడ్(Bollywood) నటి పూనమ్ పాండే(Poonam Pandey) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.

పబ్లిక్‌లో నటికి ముద్దు పెట్టబోయిన అభిమాని.. షాక్‌లో ఏం చేసిందో తెలుసా? (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్(Bollywood) నటి పూనమ్ పాండే(Poonam Pandey) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. బోల్డ్ క్యారెక్టర్స్(Bold Characters) చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నది. అయితే.. తాజాగా ఆమె ఒక అనూహ్య పరిణామం ఎదుర్కొంది. షూటింగ్‌లో భాగంగా ఆమె ముంబై నగర(Mumbai City) వీధుల్లో తిరగారు. ఈ క్రమంలో ఒక అభిమాని సెల్ఫీ కోసం వచ్చి ముద్దు పెట్టబోయాడు. దీంతో ఒక్కసారిగా షాకైన పూనమ్.. అతన్ని నెట్టేసి పరిగెట్టింది. నటి పరిగెట్టడం చూసిన స్థానికులంతా అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సెల్ఫీ(Selfie) ఇచ్చినప్పుడు తీసుకోకుండా.. ఇవేం పిచ్చిపనులు అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఇదిలా ఉండగా.. సినిమాల్లోనే కాకుండా నిజజీవింలోనూ పూనమ్ పాండే వార్తల్లో నిలిచే పనులే చేస్తుంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ కుర్రాళ్లకు హీట్ పుట్టిస్తుంది. ఆమె ఏదైనా ఫోటో లేదా వీడియో షేర్ చేస్తే, నిమిషాల్లో వైరల్ అయిపోతుంది. వివిధ రకాల కామెంట్లతో యూజర్లు కామెంట్ సెక్షన్‌ను నింపేస్తారు. ఇటీవల ఆమె పోస్టుకు నెటిజన్లంతా పెళ్లి ఎప్పుడు అని అడగ్గా.. అదో రకమైన రియాక్షన్ ఇచ్చింది. అది కూడా నెట్టింట వైరల్‌గా మారింది.

Next Story