- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హీరో విజయ్ కోసం అభిమాని నడి రోడ్డుపై బైక్ స్టంట్స్.. కేసు నమోదు
హీరో విజయ్ కోసం ఓ అభిమాని నడిరోడ్డుపై బైక్ స్టంట్స్ చేయగా అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దిశ, వెబ్ డెస్క్: హీరో విజయ్ కోసం ఓ అభిమాని నడిరోడ్డుపై బైక్ స్టంట్స్ చేయగా అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విజయ్ అభిమాని ఒకరు బైక్ పై ప్రమాదకర విన్యాసాలు చేశాడు. రెండు చేతులు వదిలి బైక్ నడిపాడు. అక్కడితో ఆగకుండా రోడ్డు పై పెట్రోల్ పోసి నిప్పు అంటించి దాని ముందు విన్యాసాలు చేశాడు. విజయ్ పార్టీ జెండాను చూపిస్తూ అభిమాని ఈ విన్యాసాలు చేశాడు. వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు కేసు నమోదు చేయాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేయడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు.
అయితే ఈ వీడియోను కొంతమంది వైరల్ చేస్తూ తమిళనాడులో బైక్ పై సినిమా హీరో, రాజకీయ నాయకుడి అభిమాని స్టంట్స్ చేస్తే కేసు నమోదు చేశారని ఏపీలో మాత్రం అభిమానులు ఏం చేసినా కేసులు నమోదు చేయడంలేదని కామెంట్ చేస్తున్నారు. అభిమానం ఉంటే ఏవైనా సేవా కార్యక్రమాలు చేసి ఇతరలకు ఉపయోగపడే పనులు చేయాలని కానీ పోస్టర్ల ముందు జంతువులను బలి ఇవ్వడం, టపాకాయాలు పేలుస్తూ వాతావరణాన్ని కలుషితం చేయడం, విన్యాసాలు చేస్తూ ఇతరులకు హాని కలిగేలా ప్రవర్తించడం లాంటివి చేయవద్దని కోరుతున్నారు.






