- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ కవి, రచయిత, నిర్మాత ప్రితీశ్ నంది కన్నుమూత
గత కొన్నాళ్లుగా సినీ ఇండస్ట్రీలోని ఎంతోమంది ప్రముఖులు కన్నుమూస్తున్నారు.

దిశ, సినిమా: గత కొన్నాళ్లుగా సినీ ఇండస్ట్రీలోని ఎంతోమంది ప్రముఖులు కన్నుమూస్తున్నారు. తాజాగా ప్రముఖ కవి, రచయిత, నిర్మాత ప్రితీశ్ నంది(Pritish Nandi) (73) చనిపోయారు. ముంబైలోని తన నివాసంలో బుధవారం గుండెపోటుతో ఆయన తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని కుమారుడు కుషన్ నంది తెలిపాడు. దీంతో ప్రితీశ్ నంది మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా జర్నలిస్ట్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన ప్రితీశ్ రచయితగా, నిర్మాతగా తన కంటూ గుర్తింపు సంపాదించుకున్నారు. గతంలో రాజ్యసభ ఎంపీగా కూడా వ్యవహరించారు. ప్రితీశ్ సుర్, కాంటే, ఝంకార్ బీట్స్, చమేలీ, హజారోన్ ఖ్వైషీన్ ఐసీ, ప్యార్ కే సైడ్ ఎఫెక్ట్స్ వంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఇంకో వారం రోజుల్లో తన 74వ పుట్టిన రోజు ఉంది. ఇంతలోనే ఆయన అనారోగ్యంతో మృతి చెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.






