బర్త్‌డే స్పెషల్‌గా ‘బ్యాండ్ మేళం‘ నుంచి హీరోయిన్ పోస్టర్‌తో పాటు క్యూట్ వీడియో రిలీజ్.. ఇలా విష్ చేస్తే ఎవరైనా పడిపోవాల్సిందే

by I. Sairam |

‘కోర్ట్.. స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’ చిత్రంతో మంచి ఫేమ్ తెచ్చుకున్న యంగ్ జంట శ్రీదేవి(Sridevi) – రోషన్(Roshan) కలిసి నటిస్తున్న సినిమా ‘బ్యాండ్ మేళం’(Band Melam).

బర్త్‌డే స్పెషల్‌గా ‘బ్యాండ్ మేళం‘ నుంచి హీరోయిన్ పోస్టర్‌తో పాటు క్యూట్ వీడియో రిలీజ్.. ఇలా విష్ చేస్తే ఎవరైనా పడిపోవాల్సిందే
X

దిశ, వెబ్‌డెస్క్: ‘కోర్ట్.. స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’ చిత్రంతో మంచి ఫేమ్ తెచ్చుకున్న యంగ్ జంట శ్రీదేవి(Sridevi) – రోషన్(Roshan) కలిసి నటిస్తున్న సినిమా ‘బ్యాండ్ మేళం’(Band Melam). స‌తీష్ జ‌వ్వాజీ(Sathish Javvaji) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీను ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకి చంద్ర‌బోస్ సంగీతం అందిస్తున్నారు. అయితే రీసెంట్‌గా ఈ సినిమా నుంచి గ్లింప్స్ విడుద‌లకాగా.. ఇది ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ఈక్రమంలో నేడు మూవీ టీమ్ ఈ మూవీలోని హీరోయిన్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ ట్వీట్ చేసింది.

నేడు యంగ్ హీరోయిన్ శ్రీదేవి పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు మూవీ టీమ్ విష్ చేస్తూ.. ‘ప్రతిభావంతురాలు & అందమైన శ్రీదేవికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. రాజమ్మగా, ఆమె వెచ్చదనం, అమాయకత్వం మరియు క్వైట్ స్ట్రెంన్త్ తెస్తుంది, అది కథను నిజంగా ప్రత్యేకంగా చేస్తుంది’ అని రాసుకొస్తూ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇక పోస్టర్‌లో ట్రెడిషనల్‌గా చిరునవ్వుతో చాలా అందంగా ఉంది.

అలాగే ఓ వీడియోను రిలీజ్ చేశారు. అందులో.. ‘రాజమ్మ.. దీని అందానికి రాజ్యాలు కూలకపోవచ్చు. కానీ నా మనసు దానిముందే బాంచన్ అయితది. ఇది నవ్వితే ముత్యాలు రాలకపోవచ్చు. కానీ అదే నవ్వుతో దాని చుట్టూ తిప్పించుకుంటది. ఇటువంటి మరదలు లేనటువంటి వాళ్ళకి అర్థం కాదు.. ఉంటే తెలిసేది నా మరదలు ఎంత స్పెషలో.. హ్యాపీ బర్త్‌డే రా.. థాంక్స్ టు మీ మమ్మీ’ అంటూ ఆమెకు విష్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. ఇలా విష్ చేస్తే ఎవరైనా పడిపోవాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story