మ్యాజిక్ క్రియేట్ చేసేందుకు ఒక్కటైన క్రేజీ టీమ్.. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో ఫహద్ ఫాజిల్ భారీ చిత్రం!

by Mallepaka Hamsa |

మ్యాజిక్ క్రియేట్ చేసేందుకు ఒక్కటైన క్రేజీ టీమ్.. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో ఫహద్ ఫాజిల్ భారీ చిత్రం!
X

దిశ, సినిమా: మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ ప్రస్తుతం హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ముఖ్యంగా ‘పుష్ప’, ‘పుష్ప 2’ సినిమాలలో భన్వర్ సింగ్ షెకావత్ పాత్రతో ఆయన ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఒక క్రేజీ ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టారు. ఆయన హీరోగా నటిస్తున్న సరికొత్త చిత్రం నేడు పూజా కార్యక్రమాలతో అత్యంత ఘనంగా ప్రారంభమైంది. ‘96’ సినిమాతో క్లాసిక్ హిట్‌ అందుకున్న ప్రముఖ దర్శకుడు ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో రాబోతుండగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ ‘వెల్స్ ఫిలిం ఇంటర్నేషనల్’ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 32 గా ఈ సినిమా రాబోతోంది. ఈ భారీ క్రేజీ ప్రాజెక్ట్‌ను టాలెంటెడ్ నిర్మాత డాక్టర్ ఇషారి కె. గణేష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. నేడు జరిగిన ఈ సినిమా పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

ఈ కొత్త ప్రయాణాన్ని అధికారికంగా ప్రకటిస్తూ చిత్రబృందం సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్‌ను జత చేసింది. "శుభప్రదమైన ఆరంభాలు. మా వెల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ ప్రొడక్షన్-32 పూజా కార్యక్రమ విశేషాలు. అపారమైన అభిరుచి, భావోద్వేగాలు,సినిమాటిక్ మాయాజాలంతో నిండిన ఒక అద్భుతమైన కథకు ఇది ఒక ప్రత్యేకమైన ఆరంభం. నిర్మాత డాక్టర్ ఇషారి కె. గణేష్, హీరో ఫహద్ ఫాజిల్, దర్శకుడు సి. ప్రేమ్ కుమార్, చిత్ర బృందం అంతా ఒక్కతాటిపైకి రావడంతో, ఈ క్రేజీ ప్రయాణం అధికారికంగా ప్రారంభమైంది" అంటూ మేకర్స్ పేర్కొన్నారు. ఫహద్ ఫాజిల్ లాంటి అద్భుతమైన నటుడు, ప్రేమ్ కుమార్ లాంటి సెన్సిబుల్ డైరెక్టర్ చేతులు కలపడంతో ఈ సినిమా సరికొత్త మ్యాజిక్ క్రియేట్ చేయడం ఖాయమనిఅంతా అభిప్రాయపడుతున్నారు.

Next Story