నెల తిరక్కుండానే ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన క్రేజీ మూవీ

by Pulgam srinivas |

తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన ‘గాయపడ్డ సింహం’ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

నెల తిరక్కుండానే ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన క్రేజీ మూవీ
X

దిశ, వెబ్ డెస్క్ : నటుడు, దర్శకుడు తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో నటించిన ‘గాయపడ్డ సింహం’ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మంచి అంచనాల నడుమ మే 1న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే థియేటర్లలో విడుదలైన నెల రోజులు పూర్తికాకముందే ఈ సినిమా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకోగా, నేటి నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది.

థియేటర్లలో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయిన ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను ఎంత మేర ఆకట్టుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి హీరోయిన్లుగా నటించగా, జేడీ చక్రవర్తి, శ్రీ విష్ణు కీలక పాత్రల్లో కనిపించారు. కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి స్వీకార్ అగస్తి సంగీతం అందించారు. సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై కళ్యాణ్ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప్, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Next Story