ఓటీటీలోకి రాబోతున్న కోర్ట్ రూమ్ డ్రామా.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

by Mallepaka Hamsa |

ఈ సిరీస్‌కు సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 సొంతం చేసుకుంది.

ఓటీటీలోకి రాబోతున్న కోర్ట్ రూమ్ డ్రామా.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
X

దిశ, సినిమా: సీనియర్ హీరో శ్రీకాంత్ ప్రధాన పాత్రలో నటింయిన సరికొత్త కోర్ట్ రూమ్ డ్రామా సీరీస్ ‘అబ్జెక్షన్ మై లార్డ్’. ఇందులో మధుబాల, అనన్య శ్ర్మ, సిజ్జు మీన్, ప్రకాష్ రాజ్, షఫీ సుమన్, ముఖేష్ రిషి కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సిరీస్‌కు ముఖేష్ జి దర్శకత్వం వహించగాజ.. డ్రీమ్ హౌస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజ్ కుమార్ ఆకెళ్ల నిర్మించారు. ఇందులో శ్రీకాంత్ పవర్ ఫుల్ లాయర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సిరీస్‌కు సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే జూలై 31 నుంచి ఈ సిరీస్ ప్రేక్షకులకు అందుబాటులోకి రాబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన సరికొత్త పోస్టర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ అంచనాలను పెంచేస్తోంది. ఆ పోస్టర్‌కు ‘‘ప్రతీ అభ్యంతరమూ వ్యవస్థను సవాల్ చేస్తుంది.. ప్రతి గొంతుకూ వినబడే అర్హత ఉంది’’ అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌ను జత చేశారు. కోర్టు బోనులో ఉన్న ఒక వ్యక్తి చుట్టూ మంటలు అంటుకున్నట్లు ఉన్న ఈ పోస్టర్ చూస్తుంటే.. సిరీస్ చాలా సస్పెన్స్, ఇంటెన్స్‌గా ఉండబోతున్నట్లు అర్థమవుతోంది.

Next Story