- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
జీవితంలో ఒక్కసారి మాత్రమే ఇలాంటి చాన్స్ వస్తుంది.. టాలీవుడ్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్

దిశ, సినిమా: ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుకగా పేరొందిన ఉత్తర ప్రదేశ్(Uttar Pradesh)లోని ప్రయాగ్ రాజ్ వేదికగా జరుగుతోన్న మహా కుంభమేళాకు సాధారణ భక్తులతో పాటు సినీ సెలబ్రిటీలు తరలి వెళ్తున్నారు. ఎంత అర్జెంట్ పనులు ఉన్నప్పటికీ వాయిదా వేసుకుని మరీ మహాకుంభమేళాకు వెళ్తూ అందరి దృష్టిని తమ వైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు ఈ వేడుకలో భాగమవుతున్నారు. పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. సామాన్యులతో పాటు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు కూడా మహా కుంభమేళాకు తరలివస్తున్నారు. అంతేకాకుండా అక్కడ పలు ప్రదేశాల్లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. కొన్ని తెలియని విషయాలను తెలుసుకుంటున్నారు.
ఇప్పటికే సంయుక్త మీనన్(Samyuktha Menon), యాంకర్ లాస్య, బిందుమాధవి(Bindu Madhavi), శ్రీనిధి శెట్టి, పూనం పాండే, పవిత్ర గౌడ, బిగ్ బాస్ ప్రియాంక జైన్(Priyanka Jain) తదితర సినీ ప్రముఖులు కుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరించారు. తాజాగా, మరో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ దిగంగన సూర్యవంశీ ఈ ఆధ్యాత్మిక వేడుకలో తళుక్కుమంది. తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాగ్ రాజ్ వచ్చిన ఆమె పవిత్ర గంగానదిలో పుణ్య స్నానం ఆచరించింది. అనంతరం నాగ సాధువుల దగ్గర ఆశీర్వాదం తీసుకుంది. ఇక ఇందులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్ షేర్ చేసింది. ‘జీవితంలో ఒక్కసారి మాత్రమే ఇలాంటి అవకాశం వస్తుంది. హర హర మహాదేవ.. శంభో శంకర’ అనే క్యాప్షన్ జత చేసింది.
ప్రస్తుతం దిగంగన పోస్ట్ వైరల్ అవుతుండగా.. అవి చూసిన వారంతా క్వీన్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, దిగంగన సూర్య వంశీ సినిమాల విషయానికి వస్తే.. ఈ అమ్మడు మొదట బుల్లితెరకు పరిచయం అయి ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. ఇక 2019లో కార్తికేయతో కలిసి హిప్పీ అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయమై వలయం, సిటీ మార్, క్రేజీ ఫెలో, శివం భజే సినిమాల్లో నటించి తన అందం, అభినయంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ఆ తర్వాత బాలీవుడ్ చెక్కేసి అక్కడ కొన్ని చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక గత ఏడాది ‘శివం భజే’ మూవీతో ప్రేక్షకులను అలరించింది. ఓ వైపు ఇండస్ట్రీలో హీరోయిన్‌గా రాణిస్తునే సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. నిత్యం పలు హాట్ ఫొటోలు షేర్ చేస్తూ కుర్రాళ్లకు హీట్ పుట్టిస్తోంది.