- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శింబు ‘అరసన్’లో యంగ్ బ్యూటీకి బంపర్ ఆఫర్.. అదృష్టంగా భావిస్తున్నానంటూ కామెంట్స్
నేను ‘అరసన్’ సినిమాలో శింబు గారికి జోడీగా నటిస్తున్నాను. ఈ పెద్ద ప్రాజెక్ట్‌లో నాకు అవకాశం దక్కిందని తెలియగానే మొదట మా అమ్మకు ఫోన్ చేసి చెప్పాను.

దిశ, సినిమా: కోలీవుడ్ యంగ్ బ్యూటీ యోగలక్ష్మి వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఫుల్ పాపులారిటీ రాబట్టుకుంది. ఇక నటనపై ఆసక్తితో ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన ఆమె తన నటన, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకుల నుండి ప్రశంసలు దక్కించుకుంది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలవడంతో యోగలక్ష్మికి ఊహించని క్రేజ్ ఏర్పడింది. తాజాగా, ఈ అమ్మడు ఓ బంపర్ ఆఫర్ అందుకుంది. తమిళ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్, హీరో శింబు కాంబినేషన్‌లో వస్తున్న భారీ యాక్షన్ సినిమా ‘అరసన్’లో మెయిన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ విషయాన్ని ఓ అవార్డ్ ఫంక్షన్‌లో స్పష్టం చేస్తూ అందరినీ ఆశ్చర్య పరిచింది. ‘‘నేను ‘అరసన్’ సినిమాలో శింబు గారికి జోడీగా నటిస్తున్నాను. ఈ పెద్ద ప్రాజెక్ట్‌లో నాకు అవకాశం దక్కిందని తెలియగానే మొదట మా అమ్మకు ఫోన్ చేసి చెప్పాను.
ఆమె ఎంతో సంతోషపడ్డారు. వెట్రిమారన్ లాంటి గొప్ప దర్శకుడి దర్శకత్వంలో, శింబు లాంటి స్టార్ హీరోతో కలిసి పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఈ ఉత్కంఠభరితమైన ప్రయాణం కోసం నేను ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను" అంటూ యోగలక్ష్మి చెప్పుకొచ్చింది. కాగా.. మధ్యలో కొన్ని కారణాల వల్ల ఆగిన ఈ సినిమా షూటింగ్, చెన్నైలోని ఈసీఆర్ పరిసరాల్లో మళ్లీ మొదలైన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ ‘వడ చెన్నై’ వాతావరణాన్ని తలపించేలా ఒక భారీ సెట్ వేసి, యోగలక్ష్మి, శింబులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. వి క్రియేషన్స్ బ్యానర్‌పై కలైపులి ఎస్. థాను నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో ఆండ్రియా, సముద్రఖని వంటి సీనియర్ నటులు ఉన్నప్పటికీ.. కథలో శింబు సరసన యోగలక్ష్మి పాత్ర చాలా కీలకంగా, ఎంతో ప్రాధాన్యతతో ఉండబోతోందని తెలుస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ఈ ఏడాది దీపావళి కానుకగా థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.






