- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నార్త్ నుంచి భారీ వసూళ్లు రాబట్టడానికి పెద్ద ప్లాన్ వేసిన ‘పెద్ది’ యూనిట్
జూన్ 3న పెద్ది ప్రీమియర్స్‌ను నార్త్ ఇండియాలో ప్రదర్శించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: మన తెలుగు నుండి విడుదలయ్యే సినిమాల్లో ఏ మూవీ అయినా 1000 కోట్ల కలెక్షన్లను రాబట్టాలంటే నార్త్ ఏరియా ప్రధానంగా మారింది. నార్త్ మార్కెట్ చాలా పెద్దది కావడంతో అక్కడ హిట్ టాక్ వస్తే భారీ కలెక్షన్లు రాబట్టచ్చనే ప్లానింగ్‌ను మేకర్స్ చేస్తున్నారు. దాంతో ఏదైనా పాన్ ఇండియా సినిమా విడుదల ఉంటే ఆ సినిమాను సౌత్‌లో ఏ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నారో నార్త్‌లో కూడా అదే రేంజ్‌లో ప్రమోట్ చేస్తున్నారు. ఇక మరికొన్ని రోజుల్లోనే తెలుగు నుండి పాన్ ఇండియా మూవీగా పెద్ది విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా బృందం కూడా నార్త్ ఇండియాపై పెద్ద స్థాయిలో ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
తాజాగా ఈ మూవీ బృందం ఈ చిత్రం యొక్క నార్త్ హక్కులను జియో స్టూడియోస్ దక్కించుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను జూన్ 4న విడుదల చేయనుండగా, జూన్ 3నే ఈ చిత్ర ప్రీమియర్స్‌ను నార్త్ ఇండియా మొత్తం ప్రదర్శించడానికి మేకర్స్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రీమియర్స్ ద్వారా ఈ చిత్రానికి మంచి టాక్ వస్తే ఓపెనింగ్స్ కూడా అదిరిపోయే రేంజ్‌లో వస్తాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో రామ్ చరణ్ హీరోగా నటించగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాకు బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించాడు.






