- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
AP High Court: ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీకి బిగ్ షాక్

దిశ,వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ (Sankranthiki Vasthunam Movie) పండగ రోజు(జనవరి 14) విడుదలైన విషయం తెలిసిందే. ఈ మూవీ రిలీజైన 9 రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా రూ.230 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించిందని చిత్ర బృందం పేర్కొంది. తొలి రోజే ఈ చిత్రం రూ.45 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసి వెంకటేష్ కెరీర్‌లో భారీ వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది.
అయితే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీకి బిగ్ షాక్ తగిలింది. ఈ చిత్రం పై ఏపీ(Andhra Pradesh) హైకోర్టు(High Court)లో పిల్ దాఖలైంది. ఈ మూవీ బడ్జెట్, వసూళ్ల విషయంలో క్విడ్ ప్రో కో జరిగిందంటూ ఈ పిల్‌లో ఆరోపించారు. ఈ సినిమా అదనపు షోల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాలో జమ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ హైకోర్టును కోరారు. అలాగే.. ఐటీ, ఈడీ, జీఎస్టీ విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మూవీ నిర్మాత దిల్ రాజు(Dil Raju) నివాసం, కార్యాలయాల్లో గత నాలుగు రోజులుగా ఐటీ దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మూవీ ఏపీ హైకోర్టులో పిల్ దాఖలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.