బ్యూటీఫుల్ బ్రేకప్ స్టోరీతో ఆసక్తిని పెంచుతున్న ‘8 వసంతాలు’ టీజర్..

by Mallepaka Hamsa |   (  Updated:2025-08-02 17:19:06  IST  )

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనంతిక సనీల్ కుమార్(Anantika Sunil Kumar) ‘మ్యాడ్’ సినిమాతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది.

బ్యూటీఫుల్ బ్రేకప్ స్టోరీతో ఆసక్తిని పెంచుతున్న ‘8 వసంతాలు’ టీజర్..
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనంతిక సనీల్ కుమార్(Anantika Sunil Kumar) ‘మ్యాడ్’ సినిమాతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు మెయిన్ లీడ్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘8 వసంతాలు’(8 Vasantalu). ఇందులో హేషమ్ అబ్దుల్(Hesham Abdul) హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు ఫణీంద్ర నర్సెట్టి(Phanindra Narsetti) దర్శకత్వం వహిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.

అయితే ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ ఇప్పటికే విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. తాజాగా, మూవీ మేకర్స్ ‘8 వసంతాలు’ (8 Vasantalu) టీజర్‌(Teaser)ను విడుదల చేశారు. ఇందులో ఓ అబ్బాయి బ్రేకప్ అయిందని వెక్కి వెక్కి ఏడుస్తుండగా.. హీరోయిన్ ఓదారుస్తూ కనిపించింది. దీంతో అతను నీకేం తెలుసు ఆ బాధ అనడంతో అనంతిక లవ్ స్టోరీని చూపిస్తారు. ఆ తర్వాత ‘‘అందరి జీవితాల్లో తుఫానులు ఉంటాయంటూ’’ హీరోయిన్ చెప్పిన డైలాగ్ అందరిలో ఆసక్తిని పెంచుతోంది. ఇక టీజర్‌ను చూస్తుంటే బ్యూటీఫుల్ బ్రేకప్ స్టోరీ(Breakup Story)తో రాబోతున్నట్లు తెలుస్తోంది.

Click For Video..

Next Story