8 Vasanthalu: వర్షాకాలంలో 8 వసంతాలు.. ఫీల్ గుడ్ మూవీ కోసం సిద్ధంగా ఉండండి!

by Chukka Sudharani |

‘మ్యాడ్’ ఫేమ్ హీరోయిన్ అనంతిక సనీల్‌కుమార్ (Anantika Sunilkumar) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘8 వసంతాలు’.

8 Vasanthalu: వర్షాకాలంలో 8 వసంతాలు.. ఫీల్ గుడ్ మూవీ కోసం సిద్ధంగా ఉండండి!
X

దిశ, సినిమా: ‘మ్యాడ్’ ఫేమ్ హీరోయిన్ అనంతిక సనీల్‌కుమార్ (Anantika Sunilkumar) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘8 వసంతాలు’. రవితేజ దుగ్గిరాల, హను రెడ్డి, సంజన, కన్నా పసునూరి, స్వరాజ్ రెబ్బా ప్రగడ, సమీరా కిశోర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఫణీంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. బ్యూటిఫుల్ బ్రేకప్‌ స్టోరీతో రాబోతోన్న ఈ చిత్రంలో అనంతిక శుద్ధి అయోధ్య పాత్రలో నటిస్తుంది. ఇందులో నుంచి ఇప్పటికే వచ్చిన పోస్టర్స్, టీజర్, గ్లింప్స్ అందరిలో సినిమాపై పాజిటివ్ ఎక్స్‌పెక్టేషన్స్‌ను క్రియేట్ చేశాయి.

దీంతో ఈ సినిమా రిలీజ్ కోసం ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా 8 వసంతాలు సినిమా రిలీజ్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. వర్షాకాలం స్పెషల్‌గా కూల్ మూవీని అందించే దిశగా ‘8 వసంతాలు’ చిత్రాన్ని జూన్ 20న థియేటర్లలో విడుదల కానుందని అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. విడుదల తేదీ పోస్టర్‌లో అనంతిక సనీల్‌కుమార్ అద్భుతమైన చీరలో, జుట్టులో గులాబీ పువ్వు, మొకంపై చిరునవ్వుతో ఆకట్టుకుంటోంది. కాగా.. ఈ మూవీలో హను రెడ్డి, రవితేజ దుగ్గిరాల, సంజన, కన్నా, స్వరాజ్ రెబ్బాప్రగడ, సమీరా కిషోర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Next Story