- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేషనల్ ఫిలిమ్ అవార్డ్స్ లిస్ట్..
71వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్రం ప్రకటించింది.

దిశ, సినిమా: 71వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్రం ప్రకటించింది. 2023 సంవత్సరానికి గాను జాతీయ చలనచిత్ర అవార్డులకు ఎంపిక చేసిన చిత్రాలను జ్యూరీ శుక్రవారం అనౌన్స్ చెయ్యగా.. ఈసారి అవార్డుల్లో తెలుగు చిత్రాలు సత్తా చాటాయి. ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్ కేసరి, ఉత్తమ యానిమేషన్ విజవల్ ఎఫెక్ట్స్ మూవీ హనుమాన్, జాతీయ ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్‌గా సాయి రాజేశ్ నీలం (బేబీ), బెస్ట్ మేల్ ప్లే బ్యాక్ సింగర్‌గా PVNS రోహిత్ (బేబీ), ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్‌గా సుకృతి వేణి (గాంధీ తాత చెట్టు), ఉత్తమ పాటల రచయితగా కాసర్ల శ్యామ్ (బలగం) అవార్డులను సొంతం చేసుకున్నారు. ఇక అన్ని భాషల నుంచి చిత్రాలను ఎంపిక చేయ్యగా.. మొత్తం 15 విభాగాల్లో అవార్డులు ప్రకటించింది.
జాతీయ చలన చిత్ర అవార్డులు:
ఫీచర్ ఫిలిమ్స్ కేటగిరి
జాతీయ ఉత్తమ చిత్రాలు: భగవంత్ కేసరి (తెలుగు), కథల్ (హిందీ), పార్కింగ్ (తమిళం)
ఉత్తమ ఫీచర్ ఫిలిమ్- 12th ఫెయిల్
ఉత్తమ బాలల చిత్రం: నాల్ (మరాఠీ)
ఉత్తమ యానిమేషన్ విజవల్ ఎఫెక్ట్స్ మూవీ: హనుమాన్ (తెలుగు)
ఉత్తమ నటుడు: జవాన్ (హిందీ) షారుక్ ఖాన్, 12th ఫెయిల్ (హిందీ) విక్రాంత్ మస్సే
ఉత్తమ నటి: మిస్సెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే (హిందీ) రాణీ ముఖర్జీ
ఉత్తమ సహాయ నటుడు: పూక్కాలం (మలయాళం) విజయ్ రాఘవన్, పార్కింగ్ (తమిళ్)
ఉత్తమ సహాయ నటి: ఉల్లుకు (మలయాళం) ఊర్విశి, వష్ (గుజరాతీ) జానకీ బోడివాలా
బెస్ట్ చైల్డ్ ఆర్డిస్ట్: గాంధీతాత చెట్టు (తెలుగు) సుకృతి వేణి, జిప్సీ (మరాఠీ) కబీర్ ఖండారీ, నాల్ 2 (మరాఠీ) త్రిష థోసర్, శ్రీనివాస్ పోకలే, భార్గవ్ జగ్దీప్
ఉత్తమ నేపథ్య గాయకుడు: బేబీ (ప్రేమిస్తున్నా) పీవీఎన్ ఎస్ రోహిత్
ఉత్తమ గేయ రచయిత: బలగం (ఊరు పల్లెటూర) కాసర్ల శ్యామ్
ఉత్తమ నేపథ్య గాయని: జవాన్ (చెలియా) శిల్పారావు
ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్: వాతి (తమిళ్) జీవీ ప్రకాశ్ కుమార్
ఉత్తమ సంగీతం (నేపథ్యం): యానిమల్- హర్షవర్ధన్ రామేశ్వర్
బెస్ట్ స్క్రీన్‌ప్లే (ఒరిజినల్): బేబీ (తెలుగు)- సాయి రాజేశ్ నీలం
బెస్ట్ స్క్రీన్‌ప్లే (ఒరిజినల్): పార్కింగ్ (తమిళ్)- రామ్ కుమార్ బాలకృష్ణన్
ఉత్తమ సినిమాటోగ్రఫీ: ది కేరళ స్టోరీ (హిందీ)- పసంతను మొహపాత్రో
ఉత్తమ దర్శకత్వం: ది కేరళ స్టోరీ (హిందీ)- సుదీప్తో సేవ్
బెస్ట్ మేకప్ : సామ్ బహూదర్ (హిందీ) శ్రీకాంత్ దేశాయ్
బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్: సామ్ బహదూర్ (హిందీ)
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్: 2018 - ఎవ్రీ వన్ ఈజ్ ఏ. హీరో (మలయాళం) మోహన్ దాస్
జెస్ట్ ఎడిటింగ్: పూక్కాలమ్ (మలయాళం) మిదున్ మురళి
బెస్ట్ సౌండ్ డిజైన్: యానిమల్ (హిందీ) సచిన్ సుధాకరన్, హరి హరన్ మురళీ ధరన్
ఉత్తమ సంభాషణలు: సిర్ఫ్ ఎక్ బందా కాఫీ హై (హిందీ) దీపక్ కింగ్రానీ
బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్: ఉత్పల్ దత్త (అస్సామీ)
నాన్ ఫీచర్ ఫిలిమ్స్ కేటగిరి
స్పెషల్ మెన్షన్ చిత్రాలు- నేకల్: క్రానికల్ ఆఫ్ ప్యాడీ మ్యాన్ (మలయాళం), ది సీ అండ్ సెవెన్ విలెజెస్ (ఒడియా)
బెస్ట్ స్క్రిప్ట్: సన్ ఫ్లవర్స్ వోర్ ది ఫస్ట్ వన్స్ టు నో (కన్నడ)
బెస్ట్ వాయిస్ ఓవర్: ది సేక్రెడ్ జాక్ - ఎక్సోరింగ్ ది ట్రీస్ ఆఫ్ విషెస్ (ఇంగ్లీష్)
ఉత్తమ పరిచయ దర్శకుడు: మావ్ ది స్పిరిట్ డ్రీమ్స్ ఆఫ్ చెరా (మిజో)
బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్: ది ఫస్ట్ ఫిల్మ్ (హిందీ)
బెస్ట్ ఎడిటింగ్: మూవీంగ్ ఫోకస్ (ఇంగ్లీష్)
బెస్ట్ సౌండ్ డిజైన్: దుందగిరి కే పూల్ (హిందీ)
బెస్ట్ సినిమాటోగ్రఫీ: లిటిల్ వింగ్స్ (తమిళ్)
బెస్ట్ డైరెక్షన్: ది ఫస్ట్ పిల్మ్ (హిందీ)
బెస్ట్ ఆర్ట్స్/కల్చర్ ఫిల్మ్: టైమ్ఎస్ తమిళనాడు (ఇంగ్లీష్)
బెస్ట్ బయోగ్రాఫికల్ ఫిల్మ్: నూ బావు, మా గావ్ (ఒడిశా), లెంటినో ఓవో ఏ లైట్ ఆన్ ది. ఈస్టన్ హారిజాన్ (ఇంగ్లీష్)






