71st National Film Awards: అట్టహాసంగా అవార్డుల ప్రదానోత్సవం.. న్యూఢిల్లీలో మెరిసిన తారలు

by Chukka Sudharani |   (  Updated:2025-09-23 15:00:01  IST  )

సినిమా ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 71 వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఈ రోజు (సెప్టెంబర్ 23, 2025) న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఎంతో అట్టహాసంగా జరిగింది.

71st National Film Awards: అట్టహాసంగా అవార్డుల ప్రదానోత్సవం.. న్యూఢిల్లీలో మెరిసిన తారలు
X

దిశ, సినిమా: సినిమా ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 71 వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఈ రోజు (సెప్టెంబర్ 23, 2025) న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఎంతో అట్టహాసంగా జరిగింది. 2023వ సంవత్సరానికి గాను ఈ అవార్డులను ప్రకటించగా.. భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలకు స్వయంగా అవార్డులు అందజేసి గౌరవించారు. ఇందులో ఉత్తమ చిత్రంగా ‘12th ఫెయిల్’ (హిందీ) నిలవగా, ఉత్తమ నటులుగా షారుఖ్ ఖాన్ (జవాన్), విక్రాంత్ మస్సే (12th ఫెయిల్) అవార్డులు అందుకున్నారు. ఉత్తమ నటిగా రాణీ ముఖర్జీ (మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే) గెలుచుకోగా.. ఉత్తమ తెలుగు చిత్రంగా ‘భగవంత్ కేసరి’ అవార్డు గెలుచుకోగా.. ఈ అవార్డును డైరెక్టర్ అనిల్ రావిపూడి అందుకున్నారు.

సుకుమార్ కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డి ‘గాంధీ తాత చెట్టు’ చిత్రానికి ఉత్తమ బాల నటిగా అవార్డును కైవసం చేసుకున్నారు. ఉత్తమ నేపథ్య గాయకుడిగా పీవీఎన్ఎస్ రోహిత్ (బేబీ), ఉత్తమ మాటల రచయితగా సాయి రాజేష్ నీలం (బేబీ), ఉత్తమ గేయ రచయితగా కాసర్ల శ్యామ్ (బలగం: ఊరు పల్లెటూరు), ఉత్తమ స్టంట్ కొరియోగ్రఫీ అండ్ యానిమేషన్‌లో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘హనుమాన్’ చిత్రానికి రెండు అవార్డులు దక్కాయి. అంతే కాకుండా.. భారతీయ సినిమాకు చేసిన జీవితకాల కృష్టికి గాను మోహన్ లాల్ ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. ఇక దర్శకుడు సుదీప్తో సేన్ ‘ది కేరళ స్టోరీ’ చిత్రానికి గాను ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డులను దక్కించుకున్నారు. వీటితో పాటుగా తదితర విభాగాల్లో గెలుచుకున్నవారికి అవార్డులు అందించారు.

Next Story