వ‌చ్చే సంక్రాంతికి 6 సినిమాలు..ఇక తెలుగు ఫ్యాన్స్ కు పండ‌గే

by velandi.Saikiran |   (  Updated:2025-10-26 12:43:54  IST  )

సంక్రాంతి పండుగ అంటేనే టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద సందడి ఉంటుంది. కచ్చితంగా సంక్రాంతి పండుగకు కనీసం మూడు

వ‌చ్చే సంక్రాంతికి 6 సినిమాలు..ఇక తెలుగు ఫ్యాన్స్ కు పండ‌గే
X

దిశ‌, వెబ్ డెస్క్‌: సంక్రాంతి పండుగ అంటేనే టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద సందడి ఉంటుంది. కచ్చితంగా సంక్రాంతి పండుగకు కనీసం మూడు సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అయితే 2026 సంక్రాంతి సమయానికి ఏకంగా ఆరు సినిమాలు రిలీజ్ అయ్యేందుకు సిద్ధమయ్యాయి. ఈ ఆరు సినిమాలు కూడా పెద్ద హీరోల మూవీస్ కావడం విశేషం. ముందుగా ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ సినిమా జనవరి 9వ తేదీన రిలీజ్ కాబోతోంది.

అదే రోజున దళపతి విజయ్ నటించిన జననాయకుడు సినిమా కూడా రిలీజ్ కానుంది. ఈ సినిమా డబ్బింగ్ అయినప్పటికీ విజయ్ కు తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోంగ్ ఉంది. కాబట్టి తెలుగులో కూడా మంచి కలెక్షన్స్ రాబట్టే ఛాన్సులు ఎక్కువ. ఇక జనవరి 12వ తేదీన చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమాకు జనాలు తండోపతండాలుగా వెళ్తారని అంచనా వేస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా రావడం కారణంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఏకబడి చూస్తారని అంటున్నారు.

గత సంక్రాంతి సమయంలోనే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో అనిల్ రావిపూడి సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమా కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రవితేజ 76వ సినిమా కూడా జనవరి 13వ తేదీన రిలీజ్ కానుంది. ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఫైనల్ కాలేదు. జనవరి 14వ తేదీన నవీన్ పోలిశెట్టి నటించిన కామెడీ సినిమా అనగనగ ఒక రాజు ( Anaganaga Oka Raju) కూడా రిలీజ్ కాబోతుంది. ఇక జనవరి 15వ తేదీన శర్వానంద్ హీరోగా నటించిన నారీ నారీ నడుమ మురారి (Nari Nari Naduma Murari) మూవీ రాబోతుంది. అంటే ఈ వచ్చే సంక్రాంతికి ఆరు బడా సినిమాలే రిలీజ్ కాబోతున్నాయి. ఇందులో ఏ సినిమా సక్సెస్ అవుతుందో చూడాలి.

Next Story