నెలకు 20 సార్లు.. క్యాస్టింగ్ కౌచ్ గురించి ప్రముఖ హీరోయిన్ సంచలన కామెంట్స్..

by I. Sairam |   (  Updated:2025-02-24 06:38:32  IST  )

సాధారణంగా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉన్న సంగతి తెలిసిందే.

నెలకు 20 సార్లు.. క్యాస్టింగ్ కౌచ్ గురించి ప్రముఖ హీరోయిన్ సంచలన కామెంట్స్..
X

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే చాలా మంది నటీ నటులు తమకు అలాంటివి ఏమీ జరగలేదు అని భయపడి చెప్పకుండా ఉంటుంటే.. మరికొందరు మాత్రం తమ కెరీర్‌లో ఎదురైన చేదు అనుభవాలను బహిరంగా బయటపెడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ బ్యూటీ ఇండస్ట్రీలో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన కామెంట్స్ చేసింది. వివరాల్లోకి వెళితే..

ప్రముఖ భోజ్‌పురి యాక్టర్ అక్షర సింగ్(AKSHARA SING) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె తన నటనతో మంచి గుర్తింపు సంపాదించడమే కాకుండా స్టార్‌డమ్‌ కూడా అందుకుంది. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో 6.7 మిలియన్లకు పైగా ఫాలోవర్లను సంపాదించుకున్నది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే ఈ బ్యూటీ భోజ్‌పురి సినీ నటుడు పవన్ సింగ్‌(Pawan Sing)తో ప్రేమలో పడింది. అయితే, కొన్ని కారణాల వల్ల వారు విడిపోయారు.

ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ భోజ్ పురి సినిమాల్లో కాస్టింగ్ కౌచ్ ఎలా జరుగుతుంది? తాను ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంది.. ? అనే విషయాల గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. అక్షర సింగ్ మాట్లాడుతూ.. “ప్రతి రంగంలోనూ దోపిడీ జరుగుతోంది. మీరు సినిమా పరిశ్రమ గురించి మాట్లాడుతుంటే, ఇది మీ ఇష్టం. మీరు సినీ ఇండస్ట్రీలో రాజీ పడకూడదని నిర్ణయించుకుంటే, ప్రపంచంలోని ఏ శక్తి కూడా మిమ్మల్ని ఆపలేదు. కానీ చాలా మంది రాజీ పడడాన్నే ఎంచుకుంటారు. కాబట్టి ప్రశ్న ఏమిటంటే, మీరు ఎందుకు రాజీ పడతారు? ప్రతి ఒక్కరికి ఒక ఎంపిక ఉంటుంది.

రాజీపడాలనుకునే వారు అలా చేస్తారు, తమ సూత్రాలపై స్థిరంగా నిలబడాలనుకునే వారు స్థిరంగా ఉంటారు” అంటూ క్యాస్టింగ్ కౌచ్ గురించి చెప్పుకొచ్చింది. అలాగే సినీరంగంలో రాజీపడకపోతే అవకాశాలు రావా అని యాంకర్ అడగ్గా.. దానికి అక్షర సింగ్ స్పందిస్తూ.. ‘ఇక్కడ రాజీ లేదు ప్రత్యక్ష ప్రేమ మాత్రమే ఉంది. నేను ఓ వ్యక్తిని నెలకు 20 సార్లు ప్రేమించాను. కానీ విడిపోయాము. ఇప్పుడు ఆ నింద అమ్మాయిలపైనే పడుతుంది. అమ్మాయినే నిందిస్తున్నారు. అమ్మాయిలు భావోద్వేగానికి లోనవుతారు, అందరూ ప్రేమించబడాలని కోరుకుంటారు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story