ఒకే ఫ్రేమ్‌లో 19 మంది యంగ్ డైరెక్టర్స్..ఇదే మంచి మార్గం అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టిన శైలేష్ కొలను

by Mallepaka Hamsa |   (  Updated:2025-05-11 09:09:07  IST  )

టాలీవుడ్ హీరో నాని (nani), శైలేష్ కొలను(Sailesh Kolanu ) కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘హిట్-3’(Hit-3).

ఒకే ఫ్రేమ్‌లో 19 మంది యంగ్ డైరెక్టర్స్..ఇదే మంచి మార్గం  అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టిన శైలేష్ కొలను
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో నాని (nani), శైలేష్ కొలను(Sailesh Kolanu ) కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘హిట్-3’(Hit-3). మే 1న థియేటర్స్‌లోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించింది. అంతేకాకుండా భారీ కలెక్షన్లు రాబడుతూ దూసుకుపోతుంది. ఈక్రమంలో.. మూవీ మేకర్స్ ‘హిట్-3’ సక్సెస్ మీట్ నిర్వహించారు. అలాగే శైలేష్ కొలను టాలీవుడ్ యంగ్ డైరెక్టర్స్ అందరికీ పార్టీ ఇచ్చారు. పార్టీ ఎంజాయ్ చేసిన వారంతా కలిసి ఫొటోలు తీసుకున్నారు. ఇక ఈ విషయాన్ని తెలుపుతూ శైలేష్ కొలను ట్విట్టర్ ద్వారా ఓ పోస్ట్ పెట్టారు. ‘‘కష్ట సమయాల్లో నాకు తోడుగా నిలిచిన వ్యక్తులతో నా విజయాన్ని పంచుకోవడం కంటే మంచి మార్గం ఏముంటుంది.

టాలీవుడ్‌లోని మేమంతా ఎప్పుడూ టచ్‌లోనే ఉంటాం. యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటూనే ఉంటాం. సినిమాలను కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం. ఇదే కుటుంబం అంటే’’ అని రాసుకొచ్చాడు. అయితే ఈ ఫొటోలో బుచ్చిబాబు, రాహుల్ సాంకృత్యాయన్. శ్రీరామ్ ఆధిత్య, సందీప్ రాజ్, వెంకీ కుడుముల, చందూ మొండేటి(Chandoo Mondeti), హసిత్, వివేక్ ఆత్రేయ, చంద్ర, సాగర్, భరత్ కమ్మా, పవన్ సాధినేని(Pawan Sadhineni), అనుదీప్, మున్నా, శివ నిర్వాణ, రాజేష్, వశిష్ఠ, ప్రశాంత్ వర్మ, ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫొటో నెటిజన్లను ఆకట్టుకుంటుంది.

Next Story