మంటపుట్టిస్తున్న కీర్తి.. విడుదలైన గాంధారి వీడియో

by Web Desk |
మంటపుట్టిస్తున్న కీర్తి.. విడుదలైన గాంధారి వీడియో
X

దిశ, వెబ్‌డెస్క్: మహానటి కీర్తి సురేష్ నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. 'గాంధారి'మ్యూజికల్ వీడియో వచ్చేస్తుందని అమ్మడు ప్రకటించినప్పటి నుంచి అభిమానుల్లో ఉత్సుకత పెరిగిపోయింది. ఎట్టకేలకు ఈ వీడియోను చెప్పిన సమయానికే విడుదల చేశారు. ఈ పాటను బ్రింద దర్శకత్వంలో తెరకెక్కించగా సోనీ ఎంటర్‌టైన్మెంట్ వారు రిలీజ్ చేశారు. ఇందులో అమ్మడు పక్కా మాస్ హీరోయిన్‌గా చిందేసింది. తన అందాలతో అభిమానులను కట్టిపడేస్తోంది. వీటన్నింటితో పాటు సుద్దాల అశోక్ అందించిన లిరిక్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

ఇందులో కీర్తిని చూసిన అభిమానులు 'ఈ కీర్తి మా కీర్తి' ఒకరేనా అంటున్నారు. ఇందులో కీర్తి డాన్స్‌కి అభిమానులు ఫిదా అయిపోయారు. పక్కా ఫోక్ డాన్సర్‌గా కీర్తి దంచేసింది. ఈ వీడియో వచ్చిన కొంత సేపటికే నెట్టింట హాట్ టాపిక్‌గా మారిపోయింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తోంది. మరి ఈ వీడియో ఎన్ని రికార్డులు బద్దలు కొడుతోంది, ఎన్నింటిని క్రియేట్ చేస్తుందో చూడాలి.


Next Story