రోజుకు 40 సిగరెట్లు తాగితేనే నాకు బలం.. నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్  

by Shyam |
Actress-Anju-Mahendru
X

దిశ, సినిమా : ‘మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం’ అని ప్రభుత్వం, స్వచ్ఛంధ సంస్థలు ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాయి. థియేటర్‌లో ప్రతీ సినిమా స్టార్టింగ్‌కు ముందుకు ఈ హెల్త్ అడ్వైజ్ వస్తూనే ఉంటుంది. అయినా ఈ సూచనను ఎంత మంది పాటిస్తారో లేదో తెలియదు కానీ.. సీనియర్ బాలీవుడ్ హీరోయిన్ అంజు మహేంద్రు మాత్రం పొగతాగకుండా ఉండలేనంటోంది.

అలనాటి హీరో రాజేష్ ఖన్నా, మాజీ క్రికెటర్ గార్‌ఫీల్డ్ సోబర్స్‌‌ రిలేషన్‌షిప్‌తో అప్పట్లో వార్తల్లో నిలిచిన అంజు.. మందు, సిగరెట్ తాగితే ఆరోగ్యం చెడిపోతుందని తెలిసినా.. తను మాత్రం ఫిట్‌నెస్ కోసం ఆల్కహాల్ సేవించేదాన్నని చెప్పింది. దాదాపు రోజుకు 40 కప్పుల చాయ్‌తో పాటు 40 సిగరెట్లు తాగేదాన్నని, ప్రస్తుతం బిజినెస్ రంగంలో రాణిస్తున్న ఆమె స్మోకింగే తనను మరింత బలంగా చేసిందని వివరించింది. కాగా రాజేష్ ఖన్నాతో బ్రేకప్ తర్వాత క్రికెటర్ గార్‌ఫీల్డ్ సోబర్స్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నా.. ఈ రిలేషన్‌షిప్ కూడా బ్రేక్ కావడంతో ప్రస్తుతం ఒంటరి జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది.

Advertisement

Next Story