దేవినేని ఉమకు మరోసారి నోటీసులు

by  |

దిశ, వెబ్‌డెస్క్: సీఎం వైఎస్ జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో పాటు వీడియో మార్ఫింగ్ చేశారనే ఆరోపణలపై మాజీ మంత్రి దేవినేని ఉమకు సీఐడీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. మే 1న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ కేసు విచారణలో భాగంగా నిన్న మంగళగిరి సీఐడీ కార్యాలయంలో ఉమను అధికారులు ప్రశ్నించారు.

కానీ ఆయన ఇచ్చిన సమాధానంతో సీఐడీ అధికారులు సంతృప్తి చెందలేదు. దీంతో విచారణకు హాజరుకావాల్సిందిగా మరోసారి ఇవాళ నోటీసులు జారీ చేశారు.


Read latest Telugu news disha daily epaper

Next Story

Most Viewed