అలాంటి వారిపై ప్రత్యేక నిఘా పెట్టాం : సీఐ వాసుదేవరావు

148
CI Vasudeva Rao

దిశ, భూపాలపల్లి: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ, ఎవరైన శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని భూపాలపల్లి సీఐ వాసుదేవరావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన ఇద్దరు వ్యక్తులపై రౌడీషీటర్ ఓపెన్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… జిల్లా కేంద్రానికి చెందిన పోరండ్ల భార్గవ్ రెడ్డి(21), మరారి శివ(21) వీరిద్దరు పలు కేసుల్లో నిందితులుగా ఉన్నారని, అందుకే రౌడీషీటర్ ఓపెన్ చేశామని తెలిపారు. వ్యసనాలకు బానిపై జిల్లాలో కొందరు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, అలాంటి వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని అన్నారు. తప్పతాగి ఎవరైనా రోడ్డుమీద వీరంగం సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో నేర చరిత్ర కలిగిన, వారిపై నిఘా వేయడం జరిగిందన్నారు. చిన్న చిన్న తప్పిదాలతో జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. మద్యం సేవించి బైకులు ఇష్టానుసారంగా నడిపే వారిపైన కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, ఇకనుంచి అలాంటి వారు ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..