చిన్న గొడవ జరిగినా కఠిన చర్యలు.. సీఐ సీతయ్య వార్నింగ్

by  |
CI Seethaiah
X

దిశ, మక్తల్: కరోనా నిబంధనలు పాటిస్తూ వినాయక చవితి ఉత్సావాలు జరుపుకోవాలని మక్తల్ సీఐ సీతయ్య సూచించారు. గురువారం మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో గణేష్ మండపాల నిర్వాహకులతో ఆత్మకూరు సీఐ శంకర్‌తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ సీతయ్య మాట్లాడుతూ… ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా, ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని తెలిపారు. దేవుడితో ఆటలాడకుండా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని అన్నారు. కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచివున్న క్రమంలో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని కోరారు.

వర్షాకాలం దృష్ట్యా మండపాల వద్ద దీపాల అలంకరణలో జాగ్రత్తలు పాటించాలని, నిమజ్జన సమయంలో గొడవలకు తావివ్వొద్దని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మల్లిఖార్జున్, నారాయణ, మున్సిపల్ కౌన్సిలర్ నరసింహులు, మార్కెట్ డైరెక్టర్ సలాం, టీడీపీ నేత మధుసూదన్ రెడ్డి, అన్వర్, ఆత్మకూరు మున్సిపల్ చైర్మన్ గాయత్రి రవి కుమార్ యాదవ్, తహసీల్దార్ శ్రీనివాస్, కమిషనర్ రమేష్, ఎస్ఐ ఘవేంద్ర, మక్తల్ ఎస్ఐ రాములు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.



Next Story