సీరియల్ నటుడు సమీర్‌ కేసులో సీఐ క్లారిటీ

104

దిశ, వెబ్‌డెస్క్: అసభ్య పదజాలంతో దూషిస్తూ, లైంగికంగా వేధింపులకు పాల్పడ్డాడని కోయిలమ్మ సీరియల్ నటుడు సమీర్ అలియాస్ అమర్‌పై రాయదుర్గం పీఎస్‌లో ఓ మహిళ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. సీఐ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మణికొండలో శ్రీవిద్య, స్వాతి, లక్ష్మీ కలిసి బోటిక్ వ్యాపారం నిర్వహిస్తున్నారని చెప్పారు. కొన్ని కారణాల వల్ల స్వాతి బోటిక్ వ్యాపారం నుంచి తప్పుకుందన్నారు. అయితే, స్వాతికి రావాల్సిన కొన్ని వస్తువులు శ్రీవిద్య ఇవ్వకపోవడంతో.. గత రాత్రి కోయిలమ్మ సీరియల్ హీరో సమీర్ అలియాస్ అమర్‌తో కలిసి ఆమె ఇంటికి వెళ్లారని తెలిపారు. ఈ క్రమంలో ఇరువురి వాదనలు గొడవకు దారి తీసిందన్నారు. ఈ నేపథ్యంలోనే ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నారని సీఐ రవీందర్ క్లారిటీ ఇచ్చారు. దీంతో కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టామని తెలిపారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..