మాస్క్ లేక పోతే ఈ శిక్ష తప్పదు.. హెచ్చరిస్తున్న పోలీసులు..

by  |
మాస్క్ లేక పోతే ఈ శిక్ష తప్పదు.. హెచ్చరిస్తున్న పోలీసులు..
X

దిశ, నాచారం: కరోనా కొత్త వేరియంట్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని నాచారం ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ సూచించారు. మాస్క్ లేకుండా బయట తిరిగితే ప్రభుత్వ ఆదేశాల మేరకు రూ.1000 జరిమానా విదిస్తామని హెచ్చరించారు. ప్రతిఒక్కరూ స్వీయ నిర్బంధం విధించుకోవాలని, అత్యవసరమైతే బయటి రావాలని సీఐ సూచించారు.

మాస్క్ లతో పాటు సామాజిక దూరం పాటిస్తూ, శానిటైజర్ వాడాలన్నారు. పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు, స్పెషల్ డ్రైవ్ లు చేపడుతామని వెల్లడించారు. మాస్క్ ధరించి తమ ప్రాణాల తో పాటు ఇతరుల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు.


Next Story

Most Viewed