బికినీ భామలతో క్రిస్ గేల్…

by  |
బికినీ భామలతో క్రిస్ గేల్…
X

దిశ, వెబ్ డెస్క్: గత రెండు రోజుల క్రితమే ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదలైన విషయం తెలిసిందే. ఈ ఐపీఎల్ లో పాల్గొంటున్న జట్టు కెప్టెన్లు వివిధ రకాలుగా టీం ప్రమోషన్స్ చేస్తున్నారు. అలాగే యూనివర్సల్ బాస్.. క్రిస్ గేల్ కూడా ప్రమోషన్స్ లో రెచ్చిపోతున్నారు. ఇటీవలే మైకేల్ జాక్సన్ ల మూన్ వాక్ చేయడం మరిచిపోకముందే, పంజాబీ స్టార్‌ దలేర్‌ మెహందీ పాటకు డోలు వాయిస్తూ ఓ వీడియో రిలీజ్‌ చేశాడు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో తెగ ట్రేండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు మరో వీడియోతో గేల్ మనముందుకు వచ్చాడు.

ఈ వీడియోలో కొంత మంది యువతులు బికినిలో డాన్స్ చేస్తుండగా ప్ర‌ముఖ ఇండియ‌న్ ర్యాప‌ర్ ఎమివే బాంటాయ్‌తో క‌లిసి గేల్ త‌నలోని ర్యాప్ సింగింగ్ టాలెంట్‌ను బ‌య‌ట‌పెట్టాడు. ఈ వీడియోను ఇంస్టాగ్రామ్ లో ” జ‌మైకా టు ఇండియా అవుట్ నౌ” అని పోస్ట్ చేశాడు. దీంతో
యూనివర్సల్ బాస్ మరోసారి ట్రేండింగ్ లో ఉన్నాడు.



Next Story

Most Viewed