గేల్ ముందే చెప్పాడు: రాహుల్

by  |
గేల్ ముందే చెప్పాడు: రాహుల్
X

దిశ, స్పోర్ట్స్: సన్‌రైజర్స్ మిస్టరీ స్పిన్నర్ రషీద్ ఖాన్ బౌలింగ్‌ను వచ్చే మ్యాచ్‌లో ఉతికి ఆరేస్తానని తనతో క్రిస్ గేల్ ముందే చెప్పాడని కేఎల్ రాహుల్ వెల్లడించాడు. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఆటగాడు మయాంక్ అగర్వాల్ నిర్వహిస్తున్న ఆన్‌లైన్ షో లో పాల్గొన్న రాహుల్ పలు విషయాలు చెప్పాడు. 2018 ఐపీఎల్ సీజన్‌లో సన్ రైజర్స్‌తో తలపడిన మ్యాచ్‌లో రషీద్ బౌలింగ్‌ను ఉతికి ఆరేస్తా, నన్న స్పిన్నర్లు కట్టడి చేయడం నచ్చదు అని చెప్పాడు. ఆ మ్యాచ్‌లో నిజంగానే గేల్ దుమ్ము రేపే బ్యాటింగ్ చేశాడు. అతి తక్కువ బంతుల్లో సెంచరీ బాదడమే కాకుండా చెప్పినట్లే రషీద్ ఖాన్ వేసిన ఒక ఓవర్లో నాలుగు సిక్సర్లు బాదాడు. కాగా, ఆ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌లలో కేఎల్ రాహుల్ మూడో స్థానంలో నిలిచాడు.

Next Story

Most Viewed