దిశ, వెబ్ డెస్క్ : క్రికెట్‌లో వెస్టిండీస్ క్రికెటర్లది మేజర్ పాత్ర. ఓ దశకంలో విండీస్ క్రికెటర్లు ప్రపంచ క్రికెట్‌ను శాసించారు. ప్రత్యర్ధులకు మైదానంలో ముచ్చెమటలు పట్టించేవారు. కానీ తర్వాత వారి ప్రభ తగ్గిపోయింది. ఇటీవలి కాలంలో ఐపీఎల్, ఇతర లీగుల్లో విండీస్ క్రికెటర్లు పాల్గొని తమ సత్తా చాటుతున్నారు. అయితే కరెబీయన్ క్రికెటర్లలో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ స్టైలే వేరు.
Quarantine da khatam khel, bahar aa gaye tuhadde favourite – Chris Gayle 🕺🥰#IPL2021 #SaddaPunjab #PunjabKings @henrygayle pic.twitter.com/rrDHPZ3lvQ
— Punjab Kings (@PunjabKingsIPL) April 7, 2021
మైదానం దాటి బయటికి వెళ్లగానే పార్టీలు.. పాటలు.. డ్యాన్స్‌లతో ఎప్పుడూ సరదాగా గడిపే విధ్వంసక ఓపెనర్ క్రిస్ గేల్ మరోసారి తన టాలెంట్ చూపించాడు. ఐపీఎల్-14 కోసం భారత్ చేరుకున్న ఈ పంజాబ్ కింగ్స్ జట్టుకు చెందిన క్రిస్ గేల్.. క్వారంటైన్ ముగిసిందన్న ఆనందంతో పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్ ‘స్మూత్ క్రిమినల్’ పాటకు తనదైన స్టైల్‌లో మూన్‌వాక్ స్టెప్పులేశాడు. ఆ వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేసిన పంజాబ్ కింగ్స్.. “క్వారంటైన్ ముగిసింది. మీకు ఇష్టమైన ఆటగాడు గేల్ బయటకు వచ్చాడు” అనే కామెంట్స్ చేసింది.