చియాన్ విక్రమ్ ‘కోబ్రా’ ఇంటెన్స్ లుక్

by  |
చియాన్ విక్రమ్ ‘కోబ్రా’ ఇంటెన్స్ లుక్
X

దిశ, వెబ్‌డెస్క్: చియాన్ విక్రమ్, డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు కాంబినేషన్‌లో వస్తున్న మూవీ ‘కోబ్రా’. ఈ చిత్రం సెకండ్ లుక్‌ను ఆస్కార్ అవార్డ్ విన్నర్, మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్.రెహమాన్ క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ చేశారు. మల్టీ రోల్స్ చేయడంలో ఎక్స్‌పర్ట్ అయిన విక్రమ్ కొత్త ప్రయోగాలు బెడిసి కొట్టినా..న్యూ వెరియేషన్స్ చూపిస్తూనే ఉంటారు. తాజాగా ఈ ‘కోబ్రా’ చిత్రంలో విభిన్న పాత్రలు పోషిస్తున్నారు.

ఇటీవల విడుదలైన ‘కోబ్రా’ ఫస్ట్ లుక్‌లో సెవెన్ డిఫరెంట్ ఏజెస్‌లో కనిపించిన విక్రమ్..అన్నిటిలోనూ వేరియేషన్ చూపించాడు. ఇప్పుడు సెకండ్ లుక్‌లో విక్రమ్ పొడవాటి..గజిబిజి జట్టుతో కనిపించాడు. అతని సగం మెదడులో ఎన్నో అంకెలు సమస్యలు ఉన్నట్లు చూపించారు. ఈ పోస్టర్ ద్వారా ‘ప్రతీ ప్రాబ్లమ్‌కి మ్యాథమాటికల్ సొల్యూషన్’ ఉంటుందని పేర్కొన్నారు. ఈ కొత్త లుక్ విక్రమ్ ఫ్యాన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక ఈ చిత్రంలో మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. కేఎస్ రవికుమార్, శ్రీనిధి శెట్టి, మృణాళిని, కనికా, పద్మప్రియ, బాబు ఆంటోనీ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కరోనా కారణంగా ఆలస్యమైన ఈ చిత్రాన్ని వేసవి కానుకగా 2021 మేలో విడుదల చేసే అవకాశం ఉంది.

Next Story