హలో.. ఇలాంటి టైంలో ఇదేంటి..?

by Vadlamudi Anukaran |   (  Updated:2020-07-17 01:27:23  IST  )

<p>దిశ, ఏపీ బ్యూరో: చిత్తూరు జిల్లాలో కరోనా స్వైర విహారం చేస్తోంది. అలాంటి పరిస్థితుల్లో చిత్తూరు జిల్లాలో కీలక స్థానిక టీడీపీ నేత బైక్ ర్యాలీ నిర్వహిస్తూ వైఎస్సార్సీపీలో చేరడం తీవ్ర విమర్శలకు కారణమవుతోంది. దాని వివరాల్లోకి వెళ్తే&#8230; చిత్తూరు జిల్లా ఐరాల మండలంలోని ముదిగోళం గ్రామానికి చెందిన టీడీపీ కీలక నేత సురేందర్ రెడ్డి తన అనుచరులతో ముదిగోళం నుంచి కాణిపాకం వరకు తన మద్దతు దారులతో బైక్ ర్యాలీ నిర్వహిస్తూ పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ [&hellip;]</p>

హలో.. ఇలాంటి టైంలో ఇదేంటి..?
X

దిశ, ఏపీ బ్యూరో: చిత్తూరు జిల్లాలో కరోనా స్వైర విహారం చేస్తోంది. అలాంటి పరిస్థితుల్లో చిత్తూరు జిల్లాలో కీలక స్థానిక టీడీపీ నేత బైక్ ర్యాలీ నిర్వహిస్తూ వైఎస్సార్సీపీలో చేరడం తీవ్ర విమర్శలకు కారణమవుతోంది. దాని వివరాల్లోకి వెళ్తే… చిత్తూరు జిల్లా ఐరాల మండలంలోని ముదిగోళం గ్రామానికి చెందిన టీడీపీ కీలక నేత సురేందర్ రెడ్డి తన అనుచరులతో ముదిగోళం నుంచి కాణిపాకం వరకు తన మద్దతు దారులతో బైక్ ర్యాలీ నిర్వహిస్తూ పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు సారథ్యంలో వైఎస్సార్సీపీలో చేరారు. బాబు కండువా కప్పి సురేందర్‌రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. కరోనా వైరస్ ఆంక్షల నేపథ్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జిల్లాలో తీవ్ర ఆగ్రహానికి, విమర్శలకు కారణమవుతోంది.

Next Story