జగన్‌కు మెగాస్టార్ లేఖ.. వాటి ధరలపై పునరాలోచించాలని రిక్వెస్ట్ 

93
Jagan

దిశ, సినిమా : మెగాస్టార్ చిరంజీవి ఏపీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డిని ట్విట్టర్ వేదికగా ఓ రిక్వెస్ట్ చేశారు. పరిశ్రమ కోరిన విధంగా పారదర్శకత కోసం ఆన్‌లైన్ టికెటింగ్ బిల్ ప్రవేశపెట్టడం హర్షించదగిన విషయమన్నారు. అదే విధంగా థియేటర్ల మనుగడ కోసం, సినిమానే ఆధారంగా చేసుకున్న ఎన్నో కుటుంబాల బతుకుదెరువు కోసం తగ్గించిన టికెట్ ధరలను కాలానుగుణంగా.. సముచితంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న విధంగా నిర్ణయిస్తే పరిశ్రమకు మేలు జరుగుతుందని అన్నారు. దేశమంతటా ఒకటే జీఎస్టీగా  ప్రభుత్వాలు పన్ను తీసుకుంటున్నప్పుడు, టికెట్ ధరల్లో కూడా అదే వెసులుబాటు ఉండటం సమంజసం. దయచేసి ఈ విషయమై పునరాలోచన చేయాలని, ఆ ప్రోత్సాహం ఉన్నప్పుడే తెలుగు పరిశ్రమ నిలదొక్కుకోగలుగుతుందని కోరారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..