మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’లో గంగవ్వ

by  |
Chiranjeevi
X

దిశ, సినిమా : మెగాస్టార్ చిరంజీవి లాక్‌డౌన్ తర్వాత వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న ‘ఆచార్య’ పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉండగా.. ఆల్రెడీ నెక్ట్స్ ఫిల్మ్ ‘గాడ్ ఫాదర్’ షూటింగ్‌లో పాల్గొంటున్నారు చిరు. కాగా తమిళ్ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్ ఫిల్మ్ సర్కిల్‌లో చక్కర్లు కొడుతోంది. ‘మై విలేజ్ షో’ ద్వారా పాపులరైన యూట్యూబ్ స్టార్ గంగవ్వ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ సీజన్ 4లోనూ పార్టిసిపేట్ చేయడంతో పాటు ‘ఇస్మార్ట్ శంకర్, రాజ రాజ చోర, లవ్ స్టోరీ’ సినిమాల్లో నటించిన గంగవ్వ.. ఇప్పుడు ఏకంగా చిరంజీవి మూవీలో చాన్స్ దక్కించుకోవడం విశేషం. ఇక ‘గాడ్ ఫాదర్’ షూటింగ్ శరవేగంగా కొనసాగుతుండగా.. మరోవైపు డైరెక్టర్ మోహన్ రాజా థమన్‌తో మ్యూజిక్ సెషన్స్ కూడా నిర్వహిస్తున్నారు.

Next Story

Most Viewed