చిరు, చెర్రీ యాక్షన్ సీక్వెన్స్.. ‘ఆచార్య’ వీడియో వైరల్

by  |
చిరు, చెర్రీ యాక్షన్ సీక్వెన్స్.. ‘ఆచార్య’ వీడియో వైరల్
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘ఆచార్య’. తండ్రీకొడుకులు తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న సినిమాకు సంబంధించిన భారీ యాక్షన్ సీక్వెన్స్ తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లిలో ప్లాన్ చేశారు డైరెక్టర్ కొరటాల శివ. ఈ క్రమంలో షూటింగ్‌ స్పాట్‌కు కలిసి వెళ్తున్న చిరు, చెర్రి.. దారిలో అభిమానులను కలిశారు. వారితో కాసేపు ముచ్చటించిన మెగా హీరోలు ఫొటోలు కూడా దిగారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. ఇందులో వీరిద్దరూ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్‌లో సేమ్ డ్రెస్సెస్ ధరించగా.. చిరు, చెర్రీ ‘ఆచార్య’ ద్వారా తమకు అమేజింగ్ బిగ్ స్క్రీన్ ట్రీట్ ఇవ్వబోతున్నారని అంటున్నారు ఫ్యాన్స్. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాటినీ ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రంలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తుండగా.. మే 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.


Next Story

Most Viewed