‘అఖండ’ ఎఫెక్ట్.. ఆచార్య టీమ్ సంచలన నిర్ణయం

by  |
Acharya
X

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటిస్తున్న సినిమా ఆచార్య. ఈ సినిమా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో ఇద్దరూ కూడా నెవ్వర్ బిఫోర్ అనేలా కనిపించనున్నారని మూవీ టీం అంటోంది. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ విషయంలో చిరు కీలక నిర్ణయం తీసుకున్నాడట. కొన్ని సన్నివేశాలను తిరిగి షూట్ చేయాలని అన్నాడట. ఆచార్య సినిమా ఫ్లాట్‌గా ఉందని, దాన్ని మార్చాలని కొరటాలన అడిగాడని టాక్ నడుస్తోంది. అయితే ఇటీవల నందమూరి నటసింహం బాలకృష్ణ తన సినిమా ‘అఖండ’తో సంచలనాలు సృష్టించారు.

దీంతో ఇప్పుడు ‘ఆచార్య’ విషయంలో చిరు ఈ కీలక నిర్ణయం తీసుకున్నాడని సోషల్ మీడియాలో వార్తలు షికార్లు చేస్తున్నాయి. దీనికి కొరటాలో ఓకే అనడంతో రీషూట్‌ సన్నాహాలు సిద్దమవుతున్నాయట. దాదాపు 25 రోజుల పాటు ఈ రీషూట్ జరగనుందని టాక్ నడుస్తోంది. ఆచార్య కూడా దేవుడు, దేవాలయానికి సంబంధించిన కథతో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాబట్టి సినిమాలో మాస్ ఎలిమెంట్స్‌ను ఇంకాస్త పెంచాలని మూవీ టీమ్ చూస్తోంది.

అయితే అఖండ సినిమాలో దేవుడు, దేవాలయానికి సంబంధించి మాస్ డైలాగ్స్ ఉన్నాయని, వాటిని చూసిన తర్వాత చిరు కూడా అదే స్థాయిలో మాస్ లుక్స్ కావాలని కోరాడని సీనీ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి సినిమాలో చిరు అనుకున్నంత స్థాయిలో మాస్ లుక్స్‌లో కనిపిస్తాడా లేదా అనేది తెలియాలంటే వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఆగాల్సిందే.



Next Story

Most Viewed