డబ్బులు లేక డయాలసిస్ మెషిన్ తయారు చేసుకున్నాడు.. 21 ఏళ్లగా బ్రతికే ఉన్నాడు

by  |
డబ్బులు లేక డయాలసిస్ మెషిన్ తయారు చేసుకున్నాడు.. 21 ఏళ్లగా బ్రతికే ఉన్నాడు
X

దిశ,వెబ్‌డెస్క్: కిడ్నీ వ్యాధి బాధితులకు డయాలసిస్‌ ఓ బాధాకర అనుభవం. ఈ దశకు చేరుకుంటే ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఆపసోపాలు పడాల్సిందే. నగరాల్లోని ఆసుపత్రుల్లో డయాలిసిస్‌లు అందుబాటులో ఉన్నా..అది ఆర్థికంగా ఇబ్బందికరమే కాకుండా.. సహకరించని దేహానికి బాధామయ పరీక్షే. నేషనల్ కిడ్నీ ఫౌండేషన్ 2013 లెక్కల ప్రకారం మనదేశంలో సుమారు 2.20లక్షల మంది కిడ్నీ బాధితులున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ కిడ్నీ బాధితులు జీవనం కొనసాగించాలంటే వ్యాధి స్థాయిని బట్టి డయాలసిస్ చేయించుకోవాల్సి ఉంటుంది. మూత్రపిండాలు కొంతవరకే పనిచేస్తున్న పరిస్థితుల్లో ఓ భారీ యంత్రం సాయంతో రక్తాన్ని అప్పుడప్పుడూ శుద్ధి చేసి మళ్లీ ఎక్కిస్తూంటారు. డయాలసిస్‌ అని పిలిచే ఈ చికిత్స ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటుంది. కొంత మందికి వారానికి ఒకసారి డయాలసిస్‌ అవసరమైతే ఇతరులకు నెల, రెండు నెలలకు ఒకసారి సరిపోతుంది. ఇదంతా కొంత ఖరీదైన వ్యవహారమే. అయినా వైద్యం చేయించుకునేందుకు ముందుకు వచ్చినా వైద్య సదుపాయం లేకపోవడం వల్ల కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే ఓ కిడ్నీ బాధితుడు తానే స్వయంగా డయాలసిస్ మిషన్ తయారు చేసుకున్నాడు.

చైనాకు చెందిన హు సాంగ్వెన్ కాలేజీ రోజుల్లో అంటే 1993లో అతని కిడ్నీ చెడిపోయింది. దీంతో వారానికి మూడు సార్లు డయాలసిస్ చేయించుకోవాల్సి వచ్చింది. అలా 6 ఏళ్ల పాటు తన కుటుంబ సభ్యులు డయాలసిస్ కోసం భారీ ఎత్తున ఖర్చు పెట్టారు. ఆరేళ్ల తర్వాత డబ్బులు లేక డయాలసిస్ చేయించుకోవడం కష్టంగా మారింది. దీంతో హు సాంగ్వెన్ ఆలోచనలో పడ్డాడు. డయాలసిస్ చేయించుకుందామంటే డబ్బులు లేవు. ట్రీట్మెంట్ తీసుకోకపోతే చనిపోతా’ అని ఆలోచిస్తుండగా డయాలసిస్ మెషిన్ తయారు చేసుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. అనుకున్నదే తడువుగా మెడికల్ ఎక్విప్ మెంట్ తో డయాలసిస్ మెషిన్ తయారు చేశాడు. ఆ డయాలసిస్ మెషినే నన్ను బ్రతికిస్తుందని హు సాంగ్వెన్ ఆనందం వ్యక్తం చేశాడు. విచిత్రం ఏంటంటే తనలాగే తన స్నేహితులు డయాలసిస్ మెషిన్ తయారు చేసుకున్నారు. ఆ మెషిన్ మీద ట్రీట్మెంట్ తీసుకుంటుండగా మరణించారు. కానీ నేను మాత్రం 21ఏళ్లుగా నేను తయారు చేసిన డయాలసిస్ మెషిన్ తోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నా. ఇప్పుడు నా ఆరోగ్యం చాలా బాగుందని హు సాంగ్వెన్ అన్నాడు.



Next Story

Most Viewed