అద్భుతం.. బంగారంతో మెరిసిపోతున్న చెట్టు.. ఎక్కడ ఉందో తెలుసా.?

by  |
అద్భుతం.. బంగారంతో మెరిసిపోతున్న చెట్టు.. ఎక్కడ ఉందో తెలుసా.?
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రకృతి ఎంతో అందమైనది. ఎంజాయ్ చేయాలనే వారికి ప్రకృతిని మించిన ఛాన్స్ మరొకటి ఉండదు. కొన్ని సందర్భాల్లో మనం నేచర్‌లో ఏదో ఒక వింతను చూసి అది నిజమేనా అని ఆశ్చర్యపోతుంటాం. అలాంటి ఘటనే చైనాలో ప్రతీ సంవత్సరం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తున్నది. చైనాలో బంగారు వర్ణంలో ఓ చెట్టు ఉంది. ఆ చెట్టును చూడాలంటే తప్పనిసరిగా ముందుగానే రిజర్వేషన్ చేయించుకోవాలి. అదేంటి చెట్టుకు రిజర్వేషన్ ఏంటి అనుకుంటున్నారా.. అదే ఆ చెట్టుకు ఉన్న ప్రత్యేకత..

చైనాలోని షాంగ్జీ రాష్ట్రంలోని జోంగునాన్ కొండల్లో 1400 సంవత్సరాల వయస్సున ఓ అరుదైన చెట్టు ఉంది. ఆ వృక్షం బంగారంలా పసుపు పచ్చగా మెరిసిపోతుంటుంది. ఆ చెట్టు ‘‘గునియిన్ గమియవో’’ అనే బౌద్ధ ఆలయంలో ఉంటుంది. ఆ వృక్షరాజం ‘‘గింకో జిలోబా’’ అనే జాతికి చెందింది. అయితే ఏడాదిలో దాదాపు 10 నెలలు ఆకుపచ్చ రంగులో ఉండే ఈ చెట్టు శరదృతువు కాలంలో మాత్రం బంగారం రంగులోకి మారుపోతుంది. ఈ సమయంలో చెట్టు మొత్తం గోల్డ్ కలర్‌లో కనిపిస్తూ పర్యాటకులను ఆకర్షిస్తుంటుంది. చెట్టు ఆకులు బంగారు వర్ణంలో ఉండి కింద రాలిపోయిన సమయంలో భూమిపై బంగారమే మొలకెత్తిందా అన్నంతగా ఆకులు మెరిసిపోతుంటాయి.

అత్యంత సుందరంగా కనిపించే ఈ చెట్టుని చూడటానికి పర్యాటకులు భారీ సంఖ్యలో వస్తుంటారు. నవంబర్, డిసెంబర్ నెలల మధ్య రోజూ 60 వేల మంది దీన్ని చూడ్డానికి వస్తున్నారంటే ఆ చెట్టుకున్న ప్రత్యేకతను అర్థం చేసుకోవచ్చు. ఈ అందాన్ని చూడాలంటే క్యూలో నాలుగైదు గంటలు నిలబడాలి. అంతేకాదు ఈ చెట్టును చూడాలనుకునే వారు ముందుగానే వెబ్‌సైట్‌లో రిజర్వేషన్ చేయించుకోవాలి. అయితే కరోనా కారణంగా ఆ చెట్టును చూడటానికి పరిమిత సంఖ్యలో పర్యాటకులను అనుమతిస్తున్నారు.



Next Story

Most Viewed