ఎవరెస్ట్‌ను మళ్లీ కొలుస్తున్న చైనా

by  |
ఎవరెస్ట్‌ను మళ్లీ కొలుస్తున్న చైనా
X

ప్రపంచంలో ఎత్తైన ఎవరెస్టు శిఖరం సరైన ఎత్తును కొలిచేందుకు చైనా సర్వేయర్ల బృందం టిబెట్ మీదుగా ఆ పర్వతాన్ని చేరుకుంది. చైనావారి గత కొలతల ప్రకారం దాని ఎత్తు 8844.43 మీటర్లు. అయితే ఇది నేపాల్ వారి కొలతకంటే నాలుగు మీటర్లు తక్కువ. మే 1వ తేదీన ఈ విషయం గురించి నేపాల్‌తో చైనాకు విబేధాలు వచ్చిన కారణంగా.. మళ్లీ ఎవరెస్ట్ ఎత్తును కొలిచేందుకు చైనా కొత్త బృందాన్ని పంపించింది. అయితే ఈసారి మానవ సైంటిస్టుల మేధస్సుతో పాటు సైంటిఫిక్ పరిజ్ఞానాన్ని కూడా మిళితం చేసి ఎవరెస్టు ఎత్తును కొలవనున్నట్లు గ్జిన్‌హువా రిపోర్ట్ చేసింది.

ఇప్పటికే ఎవరెస్టు అగ్రభాగానికి చేరుకున్న చైనా సర్వేయర్ల బృందం 20 చదరపు అడుగులలో ఒక మార్కింగ్ చేసింది. ఇప్పటికే చైనా ఆరుసార్లు ఎవరెస్ట్ ఎత్తును కొలిచింది. 1975లో కొలిచినపుడు దాని ఎత్తు 8848.13 మీటర్లుగా, 2005లో కొలిచినపుడు 8844.43 మీటర్లుగా వెల్లడించింది. టిబెట్ భాషలో ఎవరెస్ట్ శిఖరాన్ని క్వోమోలాంగ్మా అంటారు. 1961 ఒప్పందం ప్రకారం ఇది చైనా, నేపాల్ మధ్య సరిహద్దుగా ఉంది. అయితే నేపాల్‌తో పోల్చితే ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించేందుకు టిబెట్ కావాల్సినన్ని ఎక్కువ సదుపాయాలను కల్పిస్తుండటంతో ఇటు వైపు నుంచి ఎక్కేందుకు అంతర్జాతీయ ట్రెకింగ్ ఔత్సాహికులు ఆసక్తి చూపిస్తున్నారు. కాగా కరోనా వైరస్ కారణంగా మూత పడిన ఈ క్వోమోలాంగ్మా నేషనల్ పార్కును మే 1న తెరిచారు. అదే రోజు నుంచి ఎవరెస్టు ఎత్తును మళ్లీ కొలిచే పనులు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed