- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చైనా మరో దురాక్రమణ.. మన భూభాగం ఇప్పుడు..
<p>దిశ, వెబ్ డెస్క్ : చైనా దురాక్రమణ మరో సారి బయటపడింది. భారత్ భూభాగంలో ఏకంగా గ్రామాన్నే నిర్మించి తన దుష్టపన్నాగాన్ని బయట పెట్టింది. అయితే అమెరికా చెప్పేంత వరకూ మన దేశానికి ఆ విషయమే తెలియదు. అమెరికా అంతర్గత నివేదిక వచ్చిన తర్వాత భారత్ అధ్యాయనం చేసి నిర్దారించుకుంది. వెంటనే భద్రతా బలగాలు అప్రమత్తమై ఇంకా ఎక్కడెక్కడ ఇలాంటి ఆక్రమణలు జరిగాయి అని ఆరా తీస్తున్నాయి. వివాదాస్పద అరుణాచల్ ప్రదేశ్ లోని భూభాగంలో ఈ నిర్మాణాలు […]</p>

దిశ, వెబ్ డెస్క్ : చైనా దురాక్రమణ మరో సారి బయటపడింది. భారత్ భూభాగంలో ఏకంగా గ్రామాన్నే నిర్మించి తన దుష్టపన్నాగాన్ని బయట పెట్టింది. అయితే అమెరికా చెప్పేంత వరకూ మన దేశానికి ఆ విషయమే తెలియదు. అమెరికా అంతర్గత నివేదిక వచ్చిన తర్వాత భారత్ అధ్యాయనం చేసి నిర్దారించుకుంది. వెంటనే భద్రతా బలగాలు అప్రమత్తమై ఇంకా ఎక్కడెక్కడ ఇలాంటి ఆక్రమణలు జరిగాయి అని ఆరా తీస్తున్నాయి. వివాదాస్పద అరుణాచల్ ప్రదేశ్ లోని భూభాగంలో ఈ నిర్మాణాలు జరిగాయి.
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు దశాబ్దాలుగా ఆ ప్రాంతాన్ని చైనా తన ఆధీనంలో ఉంచుకుంది. అయితే శాటిలైట్ ద్వారా ఈ ప్రాంతం చైనా ఆధీనంలో ఉన్నట్టు అమెరికా వర్గాలు గుర్తించాయి. ఒకప్పుడు భారత్ అస్సాం రైఫిల్స్ పోస్ట్ ను 1959 లో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆక్రమించుకుంది. అప్పట్లో దీన్ని లాంగ్జూ ఘటనగా పేర్కొన్నారు. అప్పటి నుంచి ఆ ప్రాంతం చైనా కనుసన్నల్లో ఉంటూ వస్తోందని భారత సైనిక వర్గాలు తెలిపాయి.






