అలీబాబా కు రూ.7,300 కోట్ల ఫైన్

by  |
అలీబాబా కు రూ.7,300 కోట్ల ఫైన్
X

దిశ,వెబ్‌డెస్క్ : గుత్తాధిపత్య నియమాలను ఉల్లంఘించినందుకు చైనాకు చెందిన ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అలీబాబాకు సుమారు రూ.7,300కోట్ల జరిమానా విధించినట్లు తెలుస్తోంది. ఒక నివేదిక ప్రకారం గతంలో ఆలీబాబా తరహాలో యుఎస్ చిప్‌ తయారీ సంస్థ క్వాల్‌కామ్ 2015 లో చైనా ప్రభుత్వ రూల్స్ ను క్రాస్ చేసిందనే కారణంతో 97.5 కోట్ల డాలర్ల పెనాల్టీ చెల్లించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక పేర్కొంది. అయితే అలీబాబాకు ఫైన్ విధించే విషయంపై యాంటీట్రస్ట్ రెగ్యులేటర్లు ఇప్పటి వరకు స్పందించలేదు.

కాగా గత కొంత కాలంగా చైనా ప్రభుత్వానికి – అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా మధ్య వివాదం కొనసాగుతోంది. గతేడాది అక్టోబర్ లో చైనా షాంఘైలో జరిగిన ఓ కార్యక్రమంలో జాక్ మా చైనా ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేశారు. వ్యాపారంలో ప్రభుత్వం చేపట్టే సంస్కరణల వల్ల అనేక నష్టాలున్నాయని వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యల కారణంగా జిన్ పింగ్ ఆదేశాలతో జాక్​ మా సంస్థ యాంట్​ గ్రూప్​నకు దక్కాల్సిన ఓ పబ్లిక్​ ప్రాజెక్టును జిన్ పింగ్ ఆదేశాలతో బీజింగ్ అధికారులు నిలిపివేశారని వాల్ స్ట్రీట్​ జర్నల్ వెల్లడించింది.తాజాగా మరోసారి చైనా ప్రభుత్వం జాక్ మా సంస్థకు రూ.7,300కోట్ల ఫైన్ విధించడం చర్చాంశనీయంగా మారింది.


Next Story