అర్ధరాత్రి దంపతుల దారుణం.. సొంత బిడ్డ గొంతు నొక్కి

by  |
అర్ధరాత్రి దంపతుల దారుణం.. సొంత బిడ్డ గొంతు నొక్కి
X

దిశ, వెబ్‌డెస్క్: మద్యం మత్తు.. మనిషిని మృగంలా మారుస్తోంది. విచక్షణ మర్చిపోయేలా చేస్తోంది. ఆ సమయంలో వారు ఏమి చేసినా వారికది కరెక్ట్ అని అనిపిస్తోంది. కానీ, ఆ మద్యం మత్తు వలన ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.. మరెన్నో కుటుంబాలు చెల్లాచెదురవుతున్నాయి. మద్యం మత్తులో హత్యలు, అత్యాచారాలు చేసిన వారి గురించి చాలాసార్లు వినే ఉంటాం. కానీ, ఇక్కడ మద్యం మత్తులో సొంతబిడ్డను చేజేతులా చంపుకున్నారు తల్లిదండ్రులు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ లో వెలుగు చూసింది.

వివరాలలోకి వెళితే.. సైదాబాద్‌ డివిజన్‌ పూసల బస్తీ పరిధి క్రాంతి నగర్‌బస్తీకి చెందిన పొదిల రాజేష్‌ (36) కి జాహ్నవి (25) తో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇదివరకే ఓ బాబు ఉండగా.. ఇటీవలే మరో బిడ్డ పుట్టింది. ఇక వీరిద్దరికి మద్యం తాగే అలవాటు ఉంది. రోజు ఇద్దరు ఫుల్లుగా మద్యం సేవించి గొడవపడుతుండేవారు. ఈ క్రమంలోనే శుక్రవారం అర్ధరాత్రి కూడా ఇద్దరు మద్యం తాగి గొడవకు దిగారు. భార్యపై ఆవేశంతో భర్త రాజేష్ ప్లాస్టిక్ పైపుతో దాడి చేయడానికి ప్రయత్నించగా జాహ్నవి అతడినుంచి తప్పించుకోవడానికి తన 22 రోజుల పసికందును అడ్డుపెట్టింది. దీంతో బిడ్డకు కంటిపై గాయమైంది. అయినా వారిద్దరూ గొడవ ఆపలేదు.

భార్య తనను తాను రక్షించుకునే క్రమంలో శిశువు గొంతును గట్టిగా పట్టి నొక్కడంతో అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. ఇక ఈ విషయాన్నీ గమనించిన స్థానికులు బిడ్డను ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే పసికందు మృతిచెందినట్లు తెలిపారు. దంపతులిద్దరు గతంలో కూడా పిల్లల విషయంలో ఇలాగే ప్రవర్తించారని, రెండేళ్ల క్రితం వారి తొలి సంతానం.. బాబు ఐదు నెలలు ఉన్నప్పుడే మద్యం మత్తులో ఇంట్లో నుంచి బయటికి విసిరేసి దారుణానికి ఒడిగట్టినట్లు స్థానికులు తెలిపారు. ఇక ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు భార్యాభర్తలపై కేసు నమోదు చేసుకొని పెద్ద కుమారుడి సంరక్షణ కోసం యూసుఫ్‌గూడలోని శిశువిహార్‌లో ఉంచారు.

Next Story