ప్యానిక్ లేకుంటే పిక్నిక్‌కు వెళ్దామా..? :చిదంబరం సెటైర్లు

by Shamantha N |

<p>న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఆందోళన (ప్యానిక్) చెందొద్దని పదేపదే చెబుతున్న కేంద్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి పి.చిదంబరం సెటైర్లు వేశారు. ప్యానిక్ అవ్వాల్సింది లేకుంటే పిక్నిక్‌కు వెళ్దామా..? అంటూ తనదైన శైలిలో వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ట్విట్టర్ వేదికగా ఆయన స్పందిస్తూ.. ‘ప్యానిక్ అవ్వాల్సిందేమీ లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది. మరి పిక్నిక్‌కు వెళ్దామా..?’ అని ప్రశ్నించారు. మరో ట్వీట్ లో.. ‘వ్యవస్థను విశ్వసించండని ప్రభుత్వం చెబుతున్నది. వ్యవస్థ ప్రభుత్వం [&hellip;]</p>

ప్యానిక్ లేకుంటే పిక్నిక్‌కు వెళ్దామా..? :చిదంబరం సెటైర్లు
X

న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఆందోళన (ప్యానిక్) చెందొద్దని పదేపదే చెబుతున్న కేంద్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి పి.చిదంబరం సెటైర్లు వేశారు. ప్యానిక్ అవ్వాల్సింది లేకుంటే పిక్నిక్‌కు వెళ్దామా..? అంటూ తనదైన శైలిలో వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ట్విట్టర్ వేదికగా ఆయన స్పందిస్తూ.. ‘ప్యానిక్ అవ్వాల్సిందేమీ లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది. మరి పిక్నిక్‌కు వెళ్దామా..?’ అని ప్రశ్నించారు. మరో ట్వీట్ లో.. ‘వ్యవస్థను విశ్వసించండని ప్రభుత్వం చెబుతున్నది. వ్యవస్థ ప్రభుత్వం కంటే పెద్దదా..? ఇంత పెద్ద వ్యవస్థకు ప్రధానమంత్రి ఎవరు..? దయచేసి మాకు చెప్పండి’ అంటూ చురకలు అంటించారు.

Next Story