వింత వ్యాధితో నాటు కోళ్లు మృతి

by  |
వింత వ్యాధితో నాటు కోళ్లు మృతి
X

దిశ, కేసముద్రం(నెల్లికుదురు): మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని ఎర్రబెల్లి గూడెం గ్రామ శివారు బడి తండాలో సుమారు 800 నాటు కోళ్లు గురువారం వింత వ్యాధితో మృతి చెందాయి. బాధితుడు భూక్య వీరన్న తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గత కొద్ది సంవత్సరాలుగా నాటు కోళ్ల ఫారం నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. గత రెండు రోజుల నుండి కోళ్లు మృతి చెందుతున్నాయి. ఇప్పటి వరకు సుమారు ఎనిమిది వందల కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఏలాంటి రోగ లక్షణాలు లేకుండా ,అంతుచిక్కని వ్యాధి తో కోళ్లు అకస్మాత్తుగా చనిపోవడం వల్ల అపార నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.


Next Story

Most Viewed