- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'కరోనా'పై క్షమాపణ కోరిన ఛార్మి
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ, హైదరాబాద్‌లో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో ప్రజలు హడలి పోతున్నారు. నివారణ చర్యల దిశగా ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయి. అయితే ఇదేదో సంతోషకరమైన విషయమన్నట్లు నటి, నిర్మాత ఛార్మి కౌర్ ఓ టిక్ టాక్ వీడియో చేసి పోస్ట్ చేసింది. ఆల్ ది బెస్ట్ గాయ్స్ కరోనా ఢిల్లీ, తెలంగాణ వరకు వచ్చిందట అంటూ నవ్వుతూ వీడియో చేసింది ఛార్మి. దీంతో మండిపోయిన నెటిజన్లు ఇదేమైనా స్వీట్ న్యూస్ అనుకుంటున్నావా ఆల్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ, హైదరాబాద్‌లో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో ప్రజలు హడలి పోతున్నారు. నివారణ చర్యల దిశగా ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయి. అయితే ఇదేదో సంతోషకరమైన విషయమన్నట్లు నటి, నిర్మాత ఛార్మి కౌర్ ఓ టిక్ టాక్ వీడియో చేసి పోస్ట్ చేసింది. ఆల్ ది బెస్ట్ గాయ్స్ కరోనా ఢిల్లీ, తెలంగాణ వరకు వచ్చిందట అంటూ నవ్వుతూ వీడియో చేసింది ఛార్మి. దీంతో మండిపోయిన నెటిజన్లు ఇదేమైనా స్వీట్ న్యూస్ అనుకుంటున్నావా ఆల్ ది బెస్ట్ చెప్తున్నావు అంటూ కామెంట్స్ చేశారు. దీంతో క్షమాపణ చెప్పింది ఛార్మి. విషయంపై అవగాహన లేమితోనే ఇలా చేశానని సారీ చెప్పింది. ఇకపై ఇలాంటి విషయాలపై అప్రమత్తంగా ఉంటానని.. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటానని తెలిపింది.
Next Story






