- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిన్నక్క ఇకలేరు
by Sridhar Babu |
<p>దిశ, భద్రాచలం: చర్ల మండల వైస్ ఎంపీపీ కుంజా చిన్నక్క హఠాన్మరణం చెందారు. బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో హుటాహుటిన విజయవాడ తరలించి చికిత్స చేయిస్తుండగా గురువారం రాత్రి మరణించినట్లుగా బంధువులు తెలిపారు. శుక్రవారం చర్ల మండల పరిధిలోని ఆమె స్వగ్రామం దానవాయిపేటలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. చిన్నప్పటి నుంచే విప్లవ భావాలు కలిగిన చిన్నక్క సీపీఎంలో చురుకైన కార్యకర్తగా పనిచేశారు. ప్రజాసేవలో మమేకమై నిబద్ధతతో పనిచేస్తూ.. ప్రజాభిమానం చూరగొన్నారు. చిన్నక్క హఠాన్మరణం పట్ల పలువురు […]</p>

X
దిశ, భద్రాచలం: చర్ల మండల వైస్ ఎంపీపీ కుంజా చిన్నక్క హఠాన్మరణం చెందారు. బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో హుటాహుటిన విజయవాడ తరలించి చికిత్స చేయిస్తుండగా గురువారం రాత్రి మరణించినట్లుగా బంధువులు తెలిపారు. శుక్రవారం చర్ల మండల పరిధిలోని ఆమె స్వగ్రామం దానవాయిపేటలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. చిన్నప్పటి నుంచే విప్లవ భావాలు కలిగిన చిన్నక్క సీపీఎంలో చురుకైన కార్యకర్తగా పనిచేశారు. ప్రజాసేవలో మమేకమై నిబద్ధతతో పనిచేస్తూ.. ప్రజాభిమానం చూరగొన్నారు. చిన్నక్క హఠాన్మరణం పట్ల పలువురు ప్రముఖులు దిగ్భాంతి వ్యక్తం చేశారు.
Next Story






