సాదాబైనామా దరఖాస్తులకు రూ.200 వసూలు!

by Shyam |

<p>దిశ, భూపాలపల్లి: ప్రభుత్వం ఏ పథకం ప్రవేశ పెట్టినా కొంత మందికి అది వరంగా మారుతోంది. మొన్నటి వరకు ఎల్ఆర్‌ఎస్, ఇప్పుడు సాదా బైనామాల పేరిట మీ సేవ నిర్వాహకులు అధిక వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సాదాబైనామా ప్రక్రియ మీ సేవా కేంద్రాల్లోనే చేయాల్సి ఉండడంతో వారికి వరంగా మారింది. ఒక్కో దరఖాస్తుకు రూ.45 తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినా ఒక్కో దరఖాస్తుకు రూ. 45 తీసుకోవాలి.. సాదాబైనామా దరఖాస్తు ఫారాన్ని మీసేవలో అప్‌లోడ్ చేయాలంటే రూ. [&hellip;]</p>

సాదాబైనామా దరఖాస్తులకు రూ.200 వసూలు!
X

దిశ, భూపాలపల్లి: ప్రభుత్వం ఏ పథకం ప్రవేశ పెట్టినా కొంత మందికి అది వరంగా మారుతోంది. మొన్నటి వరకు ఎల్ఆర్‌ఎస్, ఇప్పుడు సాదా బైనామాల పేరిట మీ సేవ నిర్వాహకులు అధిక వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సాదాబైనామా ప్రక్రియ మీ సేవా కేంద్రాల్లోనే చేయాల్సి ఉండడంతో వారికి వరంగా మారింది. ఒక్కో దరఖాస్తుకు రూ.45 తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినా

ఒక్కో దరఖాస్తుకు రూ. 45 తీసుకోవాలి..

సాదాబైనామా దరఖాస్తు ఫారాన్ని మీసేవలో అప్‌లోడ్ చేయాలంటే రూ. 45 తీసుకోవాల్సి ఉంటుంది. కొంత మంది నిర్వాహకులు రూ. 100 నుంచి రూ. 200 వరకు వసూలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మారుమూల గ్రామాలు, మండల కేంద్రాల్లో అయితే ఇక ఈ వసూలుకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. గడువు దగ్గర పడుతుండడంతో దరఖాస్తు దారులు ఆందోళనతో మీ సేవా కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. దీంతో కేంద్రాలు కిక్కిరిసిపోతున్నాయి. జిల్లా వ్యాప్తంగా సుమారుగా మొత్తం 180 వరకు మీ సేవా కేంద్రాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. మరికొంత మంది నిర్వాహకులు అయితే ప్రభుత్వ ఆఫీసర్ల పేర్లను సైతం వాడుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఏమైనా తప్పిదాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నప్పటికీ ఎవరూ పట్టించుకోవట్లేదు.

Next Story