- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వికాస్ దూబే ఊరిలో మొదలైన ‘మార్పు’
by Shamantha N |
<p>లక్నో : ఉత్తరప్రదేశ్ గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే స్వంత ఊరిలో మార్పు మొదలైంది. గత కొన్నేళ్లుగా ఆ ఊరికి గ్రామ ప్రధాన్ (సర్పంచ్)గా కొనసాగుతున్న ఆయన వంశ పారంపర్యానికి చెక్ పడింది. పదిహేనేళ్ల తర్వాత బిక్రు (కాన్పూర్ జిల్లా) గ్రామంలో వికాస్ దూబే కుటుంబం నుంచి కాకుండా ఇతర వ్యక్తి సర్పంచ్ అయ్యారు. ఉత్తరప్రదేశ్‌లో ఇటీవలే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగిన విషయం విధితమే. ఎస్సీ రిజర్వ్డ్‌గా ఉన్న బిక్రులో మధు అనే మహిళ సర్పంచ్‌గా ఎన్నికైంది. […]</p>

X
లక్నో : ఉత్తరప్రదేశ్ గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే స్వంత ఊరిలో మార్పు మొదలైంది. గత కొన్నేళ్లుగా ఆ ఊరికి గ్రామ ప్రధాన్ (సర్పంచ్)గా కొనసాగుతున్న ఆయన వంశ పారంపర్యానికి చెక్ పడింది. పదిహేనేళ్ల తర్వాత బిక్రు (కాన్పూర్ జిల్లా) గ్రామంలో వికాస్ దూబే కుటుంబం నుంచి కాకుండా ఇతర వ్యక్తి సర్పంచ్ అయ్యారు. ఉత్తరప్రదేశ్‌లో ఇటీవలే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగిన విషయం విధితమే. ఎస్సీ రిజర్వ్డ్‌గా ఉన్న బిక్రులో మధు అనే మహిళ సర్పంచ్‌గా ఎన్నికైంది.
గడిచిన మూడు దఫాలుగా అక్కడ వికాస్ దూబే కుటుంబం బలవంతంగా ఏకగ్రీవ ఎన్నిక చేసుకుంటున్నదని ఆరోపణలున్నాయి. సుమారు 900 ఓటర్లున్న బిక్రులో సర్పంచ్ పదవికి పది మంది పోటీకి దిగగా మధు 381 ఓట్లతో విజయం సాధించింది. గతేడాది 8 మంది పోలీసులను పొట్టన పెట్టుకున్న వికాస్ దూబే.. చివరికి అనూహ్య పరిణామాల మధ్య ఎన్‌కౌంటర్ అయిన విషయం తెలిసిందే.
Next Story






