- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాబును అడ్డుకున్న వారిపై కేసులు
by Vemula.Srinu Prasad |
<p>దిశ వెబ్‌డెస్క్: రెండు రోజుల క్రితం విశాఖపట్టణంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుని అడ్డుకున్న ఘటనలో నిందితులపై వైజాగ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. చంద్రబాబు వాహనశ్రేణిపై చెప్పులు, టమాటాలు, గుడ్లు విసిరిన వారిపై పోలీసులు కేసులు పెట్టారు. టీడీపీ నాయకులపైనా కేసులు నమోదు చేయడం విశేషం. విశాఖలో చంద్రబాబు యాత్రను నిరసిస్తూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ జేటీ రామారావుపైనా, వైసీపీ నాయకురాలు ఎన్. కృపాజ్యోతిపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. జేటీ రామారావు, కృపాజ్యోతిని పోలీసులు అదుపులోకి […]</p>
X
దిశ వెబ్‌డెస్క్: రెండు రోజుల క్రితం విశాఖపట్టణంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుని అడ్డుకున్న ఘటనలో నిందితులపై వైజాగ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. చంద్రబాబు వాహనశ్రేణిపై చెప్పులు, టమాటాలు, గుడ్లు విసిరిన వారిపై పోలీసులు కేసులు పెట్టారు. టీడీపీ నాయకులపైనా కేసులు నమోదు చేయడం విశేషం. విశాఖలో చంద్రబాబు యాత్రను నిరసిస్తూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ జేటీ రామారావుపైనా, వైసీపీ నాయకురాలు ఎన్. కృపాజ్యోతిపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. జేటీ రామారావు, కృపాజ్యోతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Next Story






